
కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. జ్వరం, జలుబు, తలనొప్పి, గొంతు నొప్పితో పాటుగా ఇంకా అనేక లక్షణాలు కూడా ఇబ్బందులు పెడుతున్నాయి. అయితే కరోనా మహమ్మారి చర్మంపై కూడా ప్రభావం చూపిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. జ్వరంతో పాటుగా చర్మంపై దద్దుర్లు వంటివి వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యనిపుణులు చెప్తున్నారు. చర్మంపై రక్తం గడ్డగట్టడం ఎరుపు లేదా నలుపు లేదా వంకాయ రంగుల్లో చర్మం మారితే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక కరోనా బారిన పడిన తరువాత చర్మ సంబంధమైన ఇబ్బందులతో అనేక మంది ఆసుపత్రులకు వెళ్తున్నారని తాజా అధ్యయనంలో తేలింది.