NTV Telugu Site icon

Film Reviews: సినిమా విడుదలైన 3 రోజుల పాటు ‘‘రివ్యూలు’’ నిషేధించాలి.. హైకోర్టు ఏం చెప్పిందంటే..

Madras High Court

Madras High Court

Film Reviews: థియేటర్లలో సినిమా విడుదలైన మూడు రోజుల పాటు వ్యక్తులు లేదా సోషల్ మీడియా ఛానెల్‌లు రివ్యూలు ఇవ్వకుండా నిషేధించాలని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే, ఈ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. తమిళ చలనచిత్ర యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (TFAPA) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ S. సౌంథర్.. ఇలాంటి వాటి సాధ్యాసాధ్యాలను గురించి ప్రశ్నించారు. ‘‘సమీక్షకులు ఏదైనా సినిమాకి రివ్యూలు ఇచ్చేందుకు అర్హులు. అది వారి అభిప్రాయం’’ అని కోర్టు పేర్కొంది.

TFAPA తరపున న్యాయవాది విజయన్ సుబ్రమణియన్ వాదిస్తూ.. కొంతమంది వ్యక్తులు సినిమా రివ్యూల ముసుగులో దర్శకులు, నటీనటులు, నిర్మాత పరువు తీశారని, వారి ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని వాదించారు. దీంతో ఈ రివ్యూలపూ పరిమితులను కోరింది. సినిమా రివ్యూల పేరుతో ఇలా సినిమాపై అభిప్రాయం చెప్పే వారిపై పరిమితులు విధించాలని, యూట్యూబ్ ఛానెళ్లు సినిమా థియేటర్లలోకి రాకుండా నిరోధించడానికి సిటీ పోలీస్ కమిషనర్‌కి ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌దారులు కోర్టుని అభ్యర్థించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ లేకపోవడాన్ని పిటిషన్ హైలెట్ చేసింది.

Read Also: Devendra Fadnavis: ఆశ్చర్యపరిచిన ఫడ్నవీస్ కొత్త పేరు.. ఆహ్వానపత్రిక వైరల్..

ప్రజాభిప్రాయాన్ని ప్రతికూలంగా మార్చేలా, ప్రేక్షకుల తమ సొంత అభిప్రాయాన్ని వెల్లడించే లోపే బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను ఈ రివ్యూలు దెబ్బతీస్తున్నాయంటూ నిర్మాతల మండలి కోర్టుకి తెలిపింది. అయితే, వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రాధాన్యతను కోర్టు నొక్కిచెప్పింది. ఈ విషయంలో రివ్యూలపై నిషేధనాన్ని విధించేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. దీనిపై స్పందించాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు యూట్యూబ్‌కి నోటీసులు జారీ చేశారు. నాలుగు వారాల తర్వాత తదుపరి విచారణ జరగనుంది.

సినిమా కలెక్షన్లపై ప్రభావంపై తమిళ చిత్రనిర్మాతల్లో పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ పిటిషన్‌ని దాఖలు చేశారు. ఇటీవల కంగువ, ఇండియన్ 2, వెట్టయాన్ సినిమాలకు యూట్యూబ్ ఛానెళ్లలో నెగిటివ్ రివ్యూలు వచ్చాయి.

Show comments