Corona Updates : దేశ రాజధానిలో పెరుగుతున్న కరోనా కేసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి కరోనా మహమ్మారి రెక్కలు చాస్తోంది. మొన్నటి వరకు కరోనా ఒమిక్రాన్ రూపంలో ప్రజలపై విరుచుకుపడి థర్డ్ వేవ్‌ను సృష్టించింది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో పలు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతుండడంతో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలు కఠినతరం చేశాయి. అంతేకాకుండా నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్ విధించి ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందకుండా అరికట్టాయి. అయితే కొత్త కొత్తగా రూపాంతరాలు చెందుతున్న కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్‌లో సబ్ వేరియంట్‌లు పుట్టుకొస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్‌లోని ఎల్452ఆర్ మ్యుటేషన్‌తో ఇప్పటికే చైనాలో భారీగా కేసులు నమోదువుతున్నాయి.
అంతేకాకుండా ఈ మ్యుటేషన్‌కు చెందిన కరోనా కేసులు ఇప్పటికే భారత్‌లో నమోదవుతుండడం ఆందోళన కలిగించే విషయం. అయితే ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు సంఖ్య నిన్నటికంటే నేడు 50 శాతం పెరిగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం ఢిల్లీలో 202 కేసులు నమోదు కాగా, నేడు 299 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 2.9 శాతానికి పెరిగింది. అయితే కరోనా కేసుల పెరుగుదలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. కరోనా పరిస్థితిని చాలా నిశితంగా గమనిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన పరిస్థితి ప్రస్తుతం లేదని వెల్లడించారు. కరోనా కేసుల సంఖ్య పెరిగితే నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!