NTV Telugu Site icon

COVID 19: దేశంలో కొత్తగా 13,086 కరోనా కేసులు.. 19 మంది మృతి

Corona Virus

Corona Virus

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 4.51 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 13,086 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 19 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి 12,456 మంది రికవరీ అయ్యారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,14,475గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2.90 శాతంగా నమోదైంది

గడిచిన రోజు దేశంలో మొత్తంగా 16 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు13,086 కేసులు నమోదు అయ్యాయి. అంటే స్వల్పంగా కేసుల సంఖ్య తగ్గింది. దేశంలో కరోనా గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటి వరకు ఇండియాలో 4,35,31,650‬ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 4,28,91,933 మంది కోలుకోగా.. 5,25,242‬ మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో రికవరీ రేటు 98.53 శాతానికి తగ్గిపోయింది.

Corona: తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. హైదరాబాద్‌లోనే 247 కొత్త కేసులు

ఇండియాలో కొవిడ్ వ్యాక్సినేషన్ కారణంగా చాలా వరకు కేసులను, మరణాలను అడ్డుకోగలుగుతున్నాం. ఇప్పటికే దాదాపుగా 80 శాతం ప్రజలకు కొవిడ్ వ్యాక్సినేషన్ అందించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 1,98,09,87,178 డోసులను అర్హులైన ప్రజలకు అందించారు. గడిచిన 24 గంటల్లో 11,44,805 మందికి వ్యాక్సినేషన్ చేశారు. ఇక గత ఏడాది ప్రారంభం నుంచి 198 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. దేశ జనాభాలో 90 శాతం మంది వయోజనులకు పూర్తిస్థాయి టీకా అందినట్లు నిన్న కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 55,51,67,797కు చేరింది. మరణాల సంఖ్య 63,62,347కు చేరింది.