Site icon NTV Telugu

కేర‌ళ‌లో క‌రోనా విల‌యం… ఒక్క‌రోజులో…

కేర‌ళ‌లో క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.  తాజాగా రాష్ట్రంలో 34,199 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  గ‌డిచిన 24 గంట‌ల్లో 8,193 మంది క‌రోనా నుంచి కోలుకోగా, 49 మంది మృతి చెందారు.  కేర‌ళ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 51,160 మంది క‌రోనాతో మృతి చెందిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి.  ఇక రాష్ట్రంలో మొత్తం 1,68,383 యాక్టీవ్ కేసులు ఉన్న‌ట్టు కేర‌ళ ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది.  మొద‌టి వేవ్‌ను కేర‌ళ స‌మర్థ‌వంతంగా ఎదుర్కొన‌గా,  రెండో వేవ్‌లో అత్య‌ధిక కేసుల‌తో పాటు మ‌ర‌ణాలు కేర‌ళ‌లో న‌మోద‌య్యాయి.

Read: అమెరికా హెచ్చ‌రిక‌: ఆ 22 దేశాల‌కు వెళ్ల‌కండి…

మొద‌టి రెండు వేవ్‌ల‌ను దృష్టిలో పెట్టుకొని కేర‌ళ స‌ర్కార్ ముందు నుంచే అప్ర‌మ‌త్తం అయింది.  క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో నైట్ క‌ర్ఫ్యూను విధించింది.  ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్న‌ది.  అయిన‌ప్ప‌టకీ కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  పెద్ద సంఖ్య‌లో టెస్టులు చేస్తున్నామని, అందుకే కేసులు అధిక సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయ‌ని కేర‌ళ స‌ర్కార్ తెలియ‌జేసింది.  

Exit mobile version