Site icon NTV Telugu

Covid Vaccine: కరోనా ఫోర్త్ వేవ్.. 18 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోస్

చైనా సహా పలు దేశాల్లో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో మన దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. ఇప్పటికే ఆరోగ్య సిబ్బందితో పాటు 60 ఏళ్లు నిండిన వారికి ప్రికాషనరీ డోస్ పేరుతో మూడో డోస్‌ను కేంద్రం సరఫరా చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో పలు ప్రాంతాలలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని బూస్టర్ డోసుల పరిధిని పెంచాలని ఆరోగ్యశాఖ అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారికి మూడో డోసు నిబంధన అడ్డంకిగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం బూస్టర్ డోస్ అందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే మూడో డోస్ ఇవ్వడం ఎప్పుడు ప్రారంభిస్తారు? దీనిని ఉచితంగానే ఇస్తారా? లేదా ప్రైవేట్ మార్కెట్‌లో డబ్బులు చెల్లించి తీసుకోవాలా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం 12 ఏళ్లకు పైబడిన అందరికీ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా రెండు డోసుల టీకాలను ఉచితంగా వేస్తున్నారు.

https://ntvtelugu.com/central-government-granted-seven-new-esi-hospitals-to-andhra-pradesh/
Exit mobile version