Site icon NTV Telugu

Corona: ఇండియాలో కరోనా కలకలం… బయటపడ్డ బీ.ఏ 4 సబ్ వేరియంట్

Omicron Ba 4 Ians

Omicron Ba 4 Ians

దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాధి దాదాపుగా తగ్గుముఖం పట్టింది. కేవలం మూడు వేలకు లోపే కేసులు నమోదు అవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. సెకండ్ వేవ్ తో పోలిస్తే థర్డ్ వేవ్ లో కరోనా ప్రభావం దేశంపై తక్కవనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాలను పెంచడం కూడా వ్యాధి వ్యాప్తి, మరణాల రేటు తగ్గించడానికి సహాయ పడ్డాయి. ప్రస్తుతం దేశంలో కేవలం 15044 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ప్రపంచాన్ని భయపెడుతున్న ఓమిక్రాన్ సబ్ వేరియంట్ బీ.ఏ 4 వేరియంట్ ఇండియాలో బయటపడింది. ఇండియాలో తొలిసారిగా హైదరాబాద్ లో ఈ వేరియంట్ బయటపడింది. ది ఇండియన్ సార్స్ కోవ్ – జినోమిక్ కన్సార్టియం( ఇన్సాకాగ్) ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

తాజాగా బీ.ఏ4 వేరియంట్ ను కనుక్కున్న తరువాత ఎవరికైతే ఈ వేరియంట్ సోకిందో ఆ వ్యక్తి కాంటాక్ట్ లను కనుగొనే పనిలో ఉన్నారు అధికారులు. బీఏ 4 వేరియంట్ సోకిన వ్యక్తి ఇటీవల సౌతాఫ్రికా నుంచి హైదరాబాద్ వచ్చారు. ఇతనితో పాటు హైదరాబాద్ కు వచ్చిన వారి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఎటువంటి లక్షణాలు లేకున్నా… సదరు వ్యక్తి నుంచి ఈనెల 9న శాంపిళ్లు సేకరించి పరీక్షించగా బీ.ఏ 4 వేరియంట్ బయటపడింది.

బీ.ఏ 4, బీ.ఏ 5 రెండు ఓమిక్రాన్ సబ్ వేరియంట్లు సౌతాఫ్రికాలో ఫిఫ్ట్ వేవ్ కు కారణం అయ్యాయి. ఇటీవల యూకే, యూఎస్ఏలో కూడా ఈ వేరియంట్ కు సంబంధించి కేసులు నమోదు అవుతున్నాయి. డెల్టాతో పోలిస్తే పెద్దగా ప్రమాదకరం కాకున్నా… వేగం వ్యాపించే లక్షణం ఈ రెండు వేరియంట్లకు ఉందని.. ఓమిక్రాన్ తో పోలిస్తే 10 రెట్లు వేగంగా బీ.ఏ 4 వేరియంట్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

Exit mobile version