NTV Telugu Site icon

Saif Ali Khan: సైఫ్‌పై దాడి “అంతర్జాతీయ కుట్ర” అనుమానం.. 5 రోజుల కస్టడీ విధించిన కోర్ట్….

Saif

Saif

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. దాడి జరిగిన మూడు రోజుల తర్వాత నిందితుడిని థానేలో పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి చేసిన వ్యక్తిని బంగ్లాదేశ్‌కి చెందిన వాడిగా గుర్తించారు. ఈ రోజు కోర్టు ముందు అతడిని ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దాడికి పాల్పడిన వ్యక్తి బంగ్లాదేశ్‌కి చెందిన వాడు కాబట్టి ‘‘అంతర్జాతీయ కుట్ర’’ అనుమానాన్ని తోసిపుచ్చలేమని వ్యాఖ్యానించింది. నిందితుడికి 5 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. నిందితుడిని షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించారు. భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన ఇతడు, గత కొన్ని రోజులుగా బిజోయ్ దాస్ అనే తప్పుడు పేరుతో ముంబైలో నివసిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

Read Also: Brahma Anandam: ఫిబ్రవరి 14న ‘బ్రహ్మా ఆనందం’ రిలీజ్.. సినిమాలో బ్రహ్మానందం లవ్‌స్టోరీ?

జనవరి 16 తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ముంబై బాంద్రాలోని సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు, అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్ శరీరంపై ఆరు గాయాలయ్యాయి. వెన్నెముక, మెడపై తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతడిని లీలావతి ఆస్పత్రి తరలించారు. శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్లు వెన్నెముక నుంచి విరిగిన కత్తిని తొలగించారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు చెప్పారు.