Site icon NTV Telugu

Congress: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. ఏకే ఆంటోనీ కొడుకు పార్టీకి రాజీనామా..

Anil Antony

Anil Antony

Congress’s AK Antony’s Son Quits Party: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని పార్టీకి గుడ్ బై చెప్పారు. బుధవారం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీకి పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ఈ రాజీనామాకు కారణం అయింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ను ఉపసంహరించుకోవాలని కోరారు. దీనిపై అసహనంతో పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Read Also: North Korea: కిమ్ రాజ్యంలో లాక్ డౌన్.. రాజధాని దిగ్భంధం

మంగళవారం అనిల్ ఆంటోనీ మాట్లాడుతూ.. బీబీసీ డాక్యుమెంటరీ దేశ సార్వభౌమత్వాన్ని అణగదొక్కడమే అని అన్నారు. 2002 గుజరాత్ అల్లర్లపై రూపొందించిన ఈ డాక్యుమెంటరీని కేరళలో ప్రదర్శిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ లోని వివిధ విభాగాలు ప్రకటించిన తరుణంలో ఆయన పార్టీకి రాజీనామా చేశారు.

‘‘ కాంగ్రెస్ లో నా పోస్టులన్నింటికీ రాజీనామా చేశాను’’ అని ట్వీట్ చేశారు. భారతదేశంపై బీబీసీ సుదీర్ఘ కాలంగా పక్షపాతాన్ని చూపుతోందని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కేరళ కాంగ్రెస్ ఈ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామనే నిర్ణయంపై అనిల్ విభేదించారు. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీపై విదేశీ వ్యవహారాల శాఖ ఘాటుగానే స్పందించింది. ఇది వలసవాద మనస్తత్వానికి ప్రతిబింబం అని దుయ్యబట్టింది. కేంద్రం ఈ డాక్యుమెంటరీని బ్లాక్ చేయాలని ఆదేశించింది.

Exit mobile version