NTV Telugu Site icon

Sanjay Raut: అలా అయితే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌కి మరిన్ని కష్టాలు..

Sanjay Raut

Sanjay Raut

Sanjay Raut: అలా అయితే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌కి మరిన్ని కష్టాలు..ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలో విజయంతో హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నట్లైంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఓడిపోయింది. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఇది ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ గురించి శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేన మౌత్ పీస్ సామ్నా పత్రికలో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈవీఎంలపై సందేహాన్ని లేవనెత్తారు. ప్రధాని నరేంద్రమోడీకి అనుకూలంగా రాజకీయాలు చేసే వ్యక్తులు గాంధీ కుటుంబం చుట్టూ ఉంటే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మరిన్ని కష్టాలు తప్పవని సంజయ్ రౌత్ ఆదివారం హెచ్చరించారు. కాంగ్రెస్ ఎంపీ చీఫ్ కమల్‌నాథ్‌ని ఉద్దేశించి రౌత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Read Also: Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిరంలో పూజారిగా యూపీ విద్యార్థి..ఎవరీ మోహిత్ పాండే..?

మధ్యప్రదేశ్ ఓట్ల లెక్కింపు సమయంలో పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్199 స్థానాల్లో ఆధిక్యంలో ఉందని, ఈవీఎంలో ఓట్లు లెక్కించే సమయంలో పరిస్థితి మారిపోయిందని అన్నారు. ప్రధాని మోడీ గెలుపు మాయాజాలం మూడు రాష్ట్రాల్లో పనిచేసిందని, తెలంగాణలో మాత్రం పనిచేయలేదని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీని కాంగ్రెస్ ఓడించలేదనేది అపోహ అని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో బీజేపీ ఓడిందని, 2018లో ఈ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల గురించి ప్రస్తావించారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మాజీ సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్ పోరాడారని, అయినా కూడా కాంగ్రెస్ ఓడిపోయిందని అన్నారు.