Congress: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రిగా ఉన్న ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తిరిగి వస్తే, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను నిషేధిస్తామని అన్నారు. ఆర్ఎస్ఎస్ సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తింపచేస్తోందని ఆరోపించారు.చట్టపరిధిలో ఆ సంస్థ పనిచేయడం లేదని అన్నారు.
Read Also: SC-ST reservation: సుప్రీంకోర్టు సిబ్బంది నియామకాల్లో తొలిసారి SC-ST రిజర్వేషన్..
ప్రియాంక్ ఖర్గే తన వాదనల్ని సమర్థించుకోవడానికి కొన్ని ఉదాహరణలను ప్రస్తావించారు. గతంలో సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్ ని నిషేధించారని, ఆయన పాదాలపై పడి దేశ చట్టాలను పాటిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇందిరా గాంధీ కూడా ఆర్ఎస్ఎస్‌ని నిషేధించారని, వారు చట్టాన్ని పాటిస్తున్నట్లు నటిస్తున్నారని, వారికి రూ. 250 కోట్ల నిధులు ఎలా వచ్చాయి, వీటిపై దర్యాప్తు చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. అంతకుముందు కూడా ఖర్గే ఆర్ఎస్‌ఎస్ గురించి ఆరోపణలు చేశారు. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను రెండింటిని వ్యతిరేకిస్తుందని, బీజేపీ దాని కీలుబొమ్మగా పనిచేస్తుందని విమర్శించారు.
