Congress blames Union Minister Smriti Irani: కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమె కుమార్తె జోయిష్ ఇరానీ గోవాలో అక్రమంగా బార్ నడుపుతోందని ఆరోపించింది. ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్మృతి ఇరానీని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. స్మృతి ఇరానీ కూతురు.. గోవాలో అక్రమంగా బార్ నడుపతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మాట్లాడుతూ.. ఇరానీ కుటుంబం తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. ఆమె కూతురు గోవాలో రెస్టారెంట్ నడుపుతోందిని.. అందులో అక్రమంగా నకిలీ బార్ లైసెన్స్ తో బార్ ను రన్ చేస్తోందని ఆరోపించారు. స్మృతి ఇరానీ కూతురు మే 2021లో మరణించిన వ్యక్తి పేరు మీద 2022 జూన్ లో లైసెన్స్ తీసుకున్నారని ఆరోపించారు. కానీ లైసెన్స్ ఎవరిపేరుపై ఉందో ఆయన 13 నెలల క్రితమే మరణించారని అన్నారు. ఇది చట్టవిరుద్ధం అని విమర్శించారు. గోవా నిబంధనల ప్రకారం ఒక రెస్టారెంట్ కు ఒక బార్ మాత్రమే పర్మిషన్ ఉంటుందని.. కానీ స్మృతి ఇరానీ కూతురు రెస్టారెంట్ కు రెండు బార్ లైసెన్సులు ఉన్నాయిని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే ఈ బార్ కు ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసిన విషయాన్ని కాంగ్రెస్ ప్రస్తావించింది. నోటీసులు ఇచ్చిన ఎక్సైజ్ అధికారిని, ఉన్నతాధికారుల ఒత్తడితో బదిలీ చేసినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
Read Also: World Population: 2100 నాటికి చైనా, ఇండియాలో భారీగా తగ్గనున్న జనాభా.. కారణాలు ఏంటంటే..?
ఈ విషయంపై ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. తక్షణమే స్మృతి ఇరానీని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. గోవాలో బార్ వ్యవహారం స్మృతి ఇరానీకి తెలియకుండా జరుగుతుందా.. అని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఈ అక్రమాల వెనక ఎవరున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కాంగ్రెస్. అయితే ఈ ఆరోపణలను స్మృతి ఇరానీ కూతురు జోయిష్ ఇరానీ తరుపు న్యాయవాది కొట్టిపారేశారు. జోయిష్ ఇరానీకి గోవాలో ఎలాంటి రెస్టారెంట్స్ లేవని.. ఎలాంటి షోకాజ్ నోటీసులు అందలేదని ఆరోపణలను ఖండించారు. స్మృతి ఇరానీ ప్రముఖ రాజకీయనాయకురాలు కావడంతో స్వార్థ ప్రయోజనాల కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.