Congress: ప్రధాని ‘‘కమ్యూనిల్ సివిల్ కోడ్’’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు..
- ఎర్రకోట వేదికగా ప్రధాని ‘‘కమ్యూనల్ సివిల్ కోడ్’’ వ్యాఖ్యలు..
- ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్..
- అంబేద్కర్‌ని అవమానిస్తున్నారంటూ మండిపాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఎర్రకోట నుంచి సుదీర్ఘ ప్రసంగం చేవారు. అయితే, ప్రధాన మంత్రి ప్రస్తుతం ఉన్న చట్టాలనున ‘‘మతపరమైన’’ వివక్షతో కూడిన చట్టాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. యూనిఫాం సివిల్ కోడ్ కోసం ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని ఆ పార్టీ తీవ్రంగా నిరసించింది. ప్రధాని ఈ రోజు మాట్లాడుతూ.. ‘‘ సుప్రీం కోర్టు యూనిఫామ్ సివిల్ కోడ్‌పై చర్చించి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న సివిల్ కోడ్ మతపరమైంది. వివక్ష చూపుతుంది. విస్తృత స్థాయిలో దీనిపై చర్చ జరగాలి. సెక్యూలర్ సివిల్ కోడ్‌ను డిమాండ్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని అన్నారు.
Read Also: Periods Leaves: మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నెలలో ఒక రోజు పీరియడ్స్ సెలవులు
Also Read
- MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
- Aadhaar Mobile Number Update: ఆధార్‌లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
- BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
ప్రధాని వ్యాఖ్యలు రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ని అవమానించడమే అని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇంఛార్జ్ జైరాం రమేష్ అన్నారు. ప్రధాని చరిత్రను ద్వేషం, దుర్మార్గం, దుష్ప్రవర్తనతో చూస్తున్నారని, ఈ రోజు ఎర్రకోట నుంచి ఇది ప్రదర్శించబడిందని ఆయన అన్నారు. మనం మతపరమైన సివిల్ కోడ్ కలిగి ఉన్నామని చెప్పడం డా. అంబేద్కర్‌ని అవమానించడమే అని చెప్పారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా కూడా పీఎం మోడీపై విరుచుకుపడ్డారు. ప్రధాని రాజ్యాంగంపై ప్రమాణం చేసి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కోడ్‌ను మతపరమైనదిగా పిలుస్తున్నాడని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఉగ్రవాద దాడులు జరిగాయని అటల్ బీహార్ వాజ్‌పేయికి వ్యతిరేకంగా మాట్లాడాడని, బంగ్లాదేశ్ హిందువుల భద్రతకు ప్రధాని ఎలాంటి చర్యలు తీసుకున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నాం..? అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
-
IRCTC: నకిలీ బుకింగ్‌లపై పట్టు బిగించిన ఐఆర్ సీటీసీ.. 3.03 కోట్ల అనుమానాస్పద ఐడీలు డీయాక్టివేట్
-
India T20 Captain: సూర్యకుమార్‌కు షాక్.. టీమిండియా కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్.. తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు..!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!