NTV Telugu Site icon

Congress: ప్రధాని ‘‘కమ్యూనిల్ సివిల్ కోడ్’’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు..

Congress

Congress

Congress: ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఎర్రకోట నుంచి సుదీర్ఘ ప్రసంగం చేవారు. అయితే, ప్రధాన మంత్రి ప్రస్తుతం ఉన్న చట్టాలనున ‘‘మతపరమైన’’ వివక్షతో కూడిన చట్టాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. యూనిఫాం సివిల్ కోడ్ కోసం ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని ఆ పార్టీ తీవ్రంగా నిరసించింది. ప్రధాని ఈ రోజు మాట్లాడుతూ.. ‘‘ సుప్రీం కోర్టు యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌పై చర్చించి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న సివిల్‌ కోడ్‌ మతపరమైంది. వివక్ష చూపుతుంది. విస్తృత స్థాయిలో దీనిపై చర్చ జరగాలి. సెక్యూలర్‌ సివిల్‌ కోడ్‌ను డిమాండ్‌ చేయాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని అన్నారు.

Read Also: Periods Leaves: మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నెలలో ఒక రోజు పీరియడ్స్ సెలవులు

ప్రధాని వ్యాఖ్యలు రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ని అవమానించడమే అని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇంఛార్జ్ జైరాం రమేష్ అన్నారు. ప్రధాని చరిత్రను ద్వేషం, దుర్మార్గం, దుష్ప్రవర్తనతో చూస్తున్నారని, ఈ రోజు ఎర్రకోట నుంచి ఇది ప్రదర్శించబడిందని ఆయన అన్నారు. మనం మతపరమైన సివిల్ కోడ్ కలిగి ఉన్నామని చెప్పడం డా. అంబేద్కర్‌ని అవమానించడమే అని చెప్పారు.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా కూడా పీఎం మోడీపై విరుచుకుపడ్డారు. ప్రధాని రాజ్యాంగంపై ప్రమాణం చేసి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కోడ్‌ను మతపరమైనదిగా పిలుస్తున్నాడని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఉగ్రవాద దాడులు జరిగాయని అటల్ బీహార్ వాజ్‌పేయికి వ్యతిరేకంగా మాట్లాడాడని, బంగ్లాదేశ్ హిందువుల భద్రతకు ప్రధాని ఎలాంటి చర్యలు తీసుకున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నాం..? అని ఆయన అన్నారు.

Show comments