నేషనల్ హెరాల్డ్ కేసులో… ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వేగవంతం చేసింది. మనీలాండరింగ్ కేసులో మంగళవారం నేషనల్ హెరాల్డ్ కార్యాలయంపై ఈడీ దాడులు నిర్వహించింది. హస్తినలోని కేంద్ర కార్యాలయంతో పాటు 12 ప్రాంతాల్లో సోదాలు చేసింది. దాడులు పూర్తయిన తర్వాత… ఆస్తులను అటాచ్ చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది. గల నెలలో మూడు రోజులు పాటు ఈడీ… సోనియా గాంధీని 12 గంటల పాటు ప్రశ్నించింది. అనారోగ్యంతో ఉన్నప్పటికీ… విచారణ పేరుతో ఈడీ కార్యాలయానికి రప్పించింది. అంతకు ముందు సోనియా తనయుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వివిధ కోణాల్లో ప్రశ్నించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులును…కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.
Read Also: CM JaganmohanReddy: జగన్‌ని కలిసిన టెక్ మహీంద్ర ఎండీ, సీఈవో
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి పలు సమస్యలపై సమాధానం చెప్పలేక…కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందని మండిపడుతోంది. దర్యాప్తు సంస్థల వేధింపులకు తమ పార్టీ నేతలెవరూ… భయపడబోరని కాంగ్రెస్ స్పష్టం చేసింది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా భారతీయుల వాణిని వినిపించేందుకు…1938లో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించారు. ఏజేఎల్ సంస్థ ఆధ్వర్యంలో పత్రిక నిర్వహణ కొనసాగింది. ప్రస్తుతం యంగ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో 2016లో ఈ వార్తా సంస్థ సేవలు పునఃప్రారంభమయ్యాయి. అయితే, రాజకీయ ద్వేషం మరియు ప్రతీకారంతో ప్రభుత్వం వ్యవహరించడం స్వతంత్ర భారతదేశంలో ఇదే మొదటిసారి… ఇది చిన్న వ్యక్తిగత స్కోర్‌లను సెట్ చేయడానికి మరియు భారతదేశ వ్యతిరేకతను భయపెట్టడానికి భారత రాజకీయాలకు పూర్తి అట్టడుగు స్థాయికి దిగజార్చుతోందని మండిపడ్డారు కాంగ్రెస్ నేత సుప్రియా.. ధరల పెరుగుదల మరియు నిరుద్యోగం వంటి సమస్యల నుండి ప్రజల దృష్టి మరల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనుమతించదు మరియు పార్లమెంటు లోపల మరియు వెలుపల పోరాడుతూనే ఉంటుందని ప్రకటించారు.
