Mani Shankar Aiyar: ఇండియా కూటమికి మరేదైనా పార్టీ నాయకత్వం వహిస్తుందా? అని అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది అసలు సంబంధిత ప్రశ్నగానే తాను భావించటం లేదు.. ఎందుకంటే, ఇండియా బ్లాక్ నాయకత్వాన్ని వదులుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉండాలని సూచించారు. కూటమిలోని ఇంకో పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని తెలిపారు. కూటమిలో భాగస్వాములుగా ఉన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా ఇతర పార్టీల్లోని వారికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉందని వెల్లడించారు.
Read Also: YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన.. నాలుగు రోజుల షెడ్యూల్ ఇదే!
అయితే, అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారనేది అంతగా పట్టించుకోను.. ఎందుకంటే కూటమిలో కాంగ్రెస్ స్థానం ఎప్పటికీ ప్రధానమైందే అని మణిశంకర్ అయ్యార్ చెప్పుకొచ్చారు. అధ్యక్షుడిగా కంటే సాధారణంగానే రాహుల్ గాంధీకి ఎక్కువ గౌరవం ఉంటుందన్నారు. కాగా, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఇండియా బ్లాక్ ఘోరంగా ఓడిపోయింది.. దీనికి కాంగ్రెస్ పార్టీనే కారణమని కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఛాన్స్ ఇస్తే కూటమిని తాను నడిపిస్తానని మమతా బెనర్జీ ప్రకటించడంతో విపక్షంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆమె నాయకత్వాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించినప్పటికి.. సమాజ్‌వాదీ పార్టీ, శివసేన (యూబీటీ), సీపీఐ సపోర్ట్ ఇస్తున్నాయి.