NTV Telugu Site icon

Congress: మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం స్థలాన్ని కోరిన కాంగ్రెస్..

Congress

Congress

Congress: ఆర్థికవేత్త, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వైద్య సమస్యలో గురువారం ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పిగా పేరొందిన మన్మోహన్ సింగ్ మరణం భారతదేశానికి తీరని లోటుగా నేతలు అభివర్ణిస్తున్నారు. రేపు అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించే స్థలంలో స్మారక చిహ్నం నిర్మించే అవకాశాల గురించి ప్రధాని నరేంద్రమోడీతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడినట్లు పార్టీ ఈరోజు తెలిపింది.

Read Also: Sonia Gandhi: మన్మోహన్‌లో ఉన్న ఆ లక్షణాలే భారతీయుల జీవితాలను మార్చేసింది

‘‘ డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరిగే చోటు ఆయన స్మారకానికి పవిత్ర వేదిక అవుతుంది. మాజీ ప్రధానుల అంత్యక్రియల స్థలంలో వారి స్మారక చిహ్నాలు ఏర్పాటు చేసే సంప్రదయాయం ఉంది. ఆయన స్థాయికి తగ్గట్లు ఆయన స్మారక చిహ్నం నిర్మిచే స్థలంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని ఆశిస్తున్నాను’’ అని కాంగ్రెస్ చీఫ్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. రేపు ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మన్మోహన్ సింగ్ అనేక నిర్ణయాలు తీసుకున్నారని, వాటి ప్రయోజనాలను దేశం నేడు పొందుతుందని ఖర్గే లేఖలో పేర్కొన్నారు. “దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు, ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశాన్ని సంక్షోభం నుండి బయటికి తీసుకువచ్చారు మరియు దేశాన్ని ఆర్థిక శ్రేయస్సు మరియు స్థిరత్వం వైపు నడిపించారు. విభజన బాధలు నుంచి తన దృఢ సంకల్పం ద్వారా ప్రపంచంలోనే ప్రముఖ రాజనీతిజ్ఞులలో ఒకరిగా ఎదిగారు’’ అని ఖర్గే అన్నారు.