దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ప్రజలపై కేంద్ర ప్రభుత్వం పెనుభారం మోపుతోందని కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖార్గే, అధిరంజన్ చౌధురి, దిగ్విజయ్ సింగ్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు తదితర ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ చౌక్ నుంచి పార్లమెంట్ భవనంలోని గాంధీ విగ్రహం వరకు “నిరసన మార్చ్” నిర్వహించారు. గత పది రోజుల్లో 9 సార్లు పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు పెరిగాయాని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. గత పదిరోజుల్లో లీటర్ కు రూ. 6.40 రూపాయలు పెరుగిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.
Congress Protest : ఇంధన ధరలపై కాంగ్రెస్ ఫైర్..
