కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఏఐసిసి కార్యాలయంలో ప్రియాంక గాంధీ తో కలిసి వచ్చి ఓటు వేశారు సోనియా గాంధీ.దేశ వ్యాప్తంగా 65 పోలింగ్ బూత్‌లలో ఎన్నికలు జరుగుతున్నాయి. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నికల జరగడం ఇది ఆరోసారి. 9 వేల మందికిపైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నికల బరిలో పార్టీ సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ ఉన్నారు. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. ఎల్లుండి ఓట్లు లెక్కింపు జరగనుంది.