Congress: ‘ఇది ఆందోళనకరం’.. కాల్పుల విరమణలో చైనా వాదనపై కాంగ్రెస్ వ్యాఖ్య
- చైనా వాదనపై స్పందించిన కాంగ్రెస్
- ఇది ఆందోళనకరం అంటూ వ్యాఖ్య
- మోడీ స్పందించాలంటూ జైరాం రమేష్ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణలో తమ పాత్ర కూడా ఉందంటూ చైనా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. నిన్నామొన్నటిదాకా ట్రంప్ పదే పదే తానే ఆపానంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా చైనా చేరింది. ట్రంప్‌తో పాటు చైనా కూడా ముఖ్యపాత్ర పోషించిందంటూ వ్యాఖ్యానించింది. అయితే ఈ వాదనను భారత విదేశాంగ తోసిపుచ్చింది. కాల్పుల విరమణలో మూడో పక్షం ప్రమేయం లేదని తేల్చి చెప్పింది.
తాజాగా ఇదే అంశంపై కాంగ్రెస్ స్పందించింది. మన జాతీయ భద్రతపై అనుమానంగా ఉందని.. ఇది ఆందోళనకరం అని వ్యాఖ్యానించింది. కాల్పుల విరమణ క్రెడిట్‌ను ట్రంప్, చైనా తీసుకుంటున్నా ప్రధాని మోడీ ఎందుకు మౌనం వీడడం లేదని ఎక్స్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రశ్నించారు. తక్షణమే స్పందించాలని కోరారు.
Also Read
- Sana Malik: పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం మే 7న ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. నాలుగు రోజుల తర్వాత మే 10న ఇరు దేశాల చర్చలతో కాల్పుల విరమణ జరిగింది. అయితే ఈ క్రెడిట్‌ను ట్రంప్ కొట్టేసే ప్రయత్నం చేశారు. ఇరు దేశాలను వాణిజ్య హెచ్చరికలతో బెదిరించడంతో కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించారు. అయితే ట్రంప్ వాదనను భారతదేశం తీవ్రంగా ఖండించింది. కాల్పుల విరమణ విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని తేల్చి చెప్పింది. అయినా కూడా ట్రంప్ ఏ మాత్రం తగ్గలేదు. ఎక్కడికెళ్లినా.. ఏ నేతతో భేటీ అయినా ప్రపంచ వ్యాప్తంగా భారత్-పాకిస్థాన్ యుద్ధంతో పాటు ఎనిమిది యుద్ధాలు ఆపినట్లుగా చెప్పుకుంటూ వచ్చారు. ఇంకోవైపు భారత్ నిరంతరం ఖండిస్తూనే ఉంది. అయినా కూడా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అయినప్పుడు కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. ఇలా ఇప్పటి వరకు 70 సార్లు ఆ విషయాన్ని ట్రంప్ గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Faridabad: ఫరీదాబాద్‌లో దారుణం.. కదులుతున్న వ్యాన్‌లో మహిళపై గ్యాంగ్‌రేప్
తాజాగా ఈ జాబితాలో చైనా కూడా చేరింది. భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలను తగ్గించడంలో ట్రంప్‌తో పాటు చైనా కూడా కృషి చేసిందని విదేశాంగ మంత్రి వాంగ్ యి ప్రకటించారు. భారత్-పాకిస్థాన్‌తో పాటు ఉత్తర మయన్మార్ ఉద్రిక్తతలు, కంబోడియా-థాయ్‌లాండ్, ఇజ్రాయెల్-పాలస్తీనా ఉద్రిక్తతలు, ఇరాన్ అణు సమస్యతో పాటు ప్రపంచ సంఘర్షణలకు బీజింగ్ శాంతికర్తగా వ్యవహరించిందని చెప్పుకొచ్చారు. ఇక ఆగస్టులో టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరు తర్వాత భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అయితే చైనా వాదనను భారత్ ఖండించింది.
President Trump has long claimed that he personally intervened to halt Operation Sindoor on May 10, 2025. He has done so on 65 different occasions in various forums in at least seven different countries. The Prime Minister has never broken his silence on these claims made by his… pic.twitter.com/H20vsGfMxB
— Jairam Ramesh (@Jairam_Ramesh) December 31, 2025
తాజావార్తలు
-
Mirzapur The Movie : మిర్జాపూర్: ది మూవీ’ టీజర్ విడుదల
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్‌హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్‌టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..