Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Congress One Family One Ticket Chintan Shibir

Congress: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం…. ‘ఒక కుటుంబం- ఒక టికెట్’

Published Date :May 13, 2022 , 4:35 pm
By Venu Goapl Reddy
Congress: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం…. ‘ఒక కుటుంబం- ఒక టికెట్’
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి  గత వైభవాన్ని తీసుకురావాలని ఆ పార్టీ యోచిస్తోంది. పార్టీలో సంస్కరణలకు వేదికగా ‘ శింతన్ శిబిర్’ నిలువనుంది. రాజస్తాన్ ఉదయ్ పూర్ వేదికగా నేటి నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇటీవల ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధిష్టానంతో పలుమార్లు చర్చించారు. పార్టీలో తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ బలోపేతానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు సూచించారు. ఇదిలా ఉంటే శింతన్ శిబిర్  తొలి రోజు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దేశంలోని బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలను తీవ్రంగా విమర్శించారు.

కుటుంబ పార్టీగా ముద్ర పడిన కాంగ్రెస్ పార్టీ అందుల్లోంచి బయటకు రావాలని చూస్తోంది. దీంట్లో భాగంగానే ఆ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ‘ ఒక కుటుంబానికి… ఒకే టికెట్’ ఇవ్వాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. మనకు పార్టీ చాలా ఇచ్చింది… పార్టీకి మనం ఇవ్వాల్సిన సమయం వచ్చిందంటూ సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే సంస్థాగతంగా పార్టీలో పనిచేయాలని… కనీసం పార్టీలో 5 ఏళ్లు పార్టీలో పనిచేసిన వారికి మాత్రమే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలిపింది. స్వార్థాన్ని వీడాలని నేతలకు అధిష్టానం సూచించింది. పార్టీ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తున్నామనే సందేశాన్ని పార్టీ నాయకులకు తెలిపారు సోనియాగాంధీ. ఇదే విధంగా పార్టీలో ఒక పదవిలో ఒక వ్యక్తి కేవలం 5 ఏళ్లు మాత్రమే ఉండాలని.. మళ్లీ ఆ పదవి చేపట్టాలంటే కనీసం మూడేళ్ల కాలపరిమితి ఉండాలనే నిబంధనను కూడా తీసుకురానున్నారు. పార్టీలోని నాయకులు, పార్టీలో పనిచేయని తమ బంధువులకు టికెట్ ఇవ్వకుండా చర్యలు తీసుకోనున్నారు.

రాజకీయ, ఆర్థిక, సామాజిక, రైతులు, యువత, సంస్థాగత అంశాల్లో మార్పులు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కమిటీలు వేశారు. ఈ కమిటీలు రూపొందించిన తీర్మానాలపై ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ఆమోదించనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • One family-one ticket
  • Rajastan
  • shintan shibir
  • sonia fire on bjp

తాజావార్తలు

  • OTR: అడుగడుగునా ఫ్లెక్సీల ఏర్పాటు.. ఎంపీ పుట్టా కవరింగ్ కలర్!

  • Spoiled Meat: నాన్‌ వెజ్‌ ప్రియుల్లారా, తస్మాత్‌ జాగ్రత్త.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం..

  • MBNR CHINNARI MURDER: బసిరెడ్డిపల్లిలో విషాదం.. కేవలం ఐదేళ్ల వయసున్న చిన్నారిని అత్యంత దారుణంగా..

  • Bank Account: అంతా మ్యూల్ మాయ.. 3 నెలల్లోనే రూ.31 కోట్లు..

  • HYD AIRPORT GANJAI: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 9 కోట్ల గంజాయి సీజ్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions