Opposition Parties Meeting: బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల రెండో రోజు మీటింగ్‌లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రావడం తమ ఉద్దేశం కాదని.. కేవలం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని, సామాజిక న్యాయాన్ని పరిరక్షించడమే తమ ధ్యేయమని ఖర్గే స్పష్టం చేశారు. అధికారంపైనా లేదా ప్రధానమంత్రి పదవిపైనా కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదని వెల్లడించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించటమే లక్షమని పేర్కొన్నారు. బెంగళూరులో రెండోరోజు జరుగుతోన్న విపక్షాల సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రారంభోపన్యాసం చేశారు. అధికారంలోకి రావడం ఈ సమావేశం ఉద్దేశం కాదు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని, సామాజిక న్యాయాన్ని పరిరక్షించడమే మా ధ్యేయం. రాష్ట్ర స్థాయిలో కొన్ని విభేదాలున్న మాట వాస్తవమే. కానీ, అవి సిద్ధాంతరపరమైనవి కావని గుర్తించాలని.. ఇవేవీ దేశం ఎదుర్కొంటున్న సమస్యల ముందు పెద్ద విషయాలు కావని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.
Read also: TS Red Alert: తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ.. 20 సెంటీ మీటర్ల వర్షం కురిసే ఛాన్స్..!
తాము 26 పార్టీలకు చెందిన వారమన్న ఖర్గే.. 11 రాష్ట్రాల్లో తమ పార్టీలు అధికారంలో ఉన్నాయన్నారు. భాజపా సొంతంగా 303 సీట్లు సాధించలేదన్నారు. ఓట్ల కోసం మిత్రపక్షాలతో కలిసి పనిచేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని వదిలేస్తుందని ఆరోపించారు. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడితోపాటు ఆయా రాష్ట్రాల నేతలు పాత మిత్రుల కోసం వివిధ రాష్ట్రాల్లో పరుగులు పెడుతున్నారని ఖర్గే విమర్శించారు.
Read also: Nabha Natesh Hot Pics: షర్ట్ బటన్ తీసేసి.. టెంప్ట్ చేస్తున్న ఇస్మార్ట్ పోరి నభా నటేష్!
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించటమే ఏకైక లక్ష్యంగా వరుసగా రెండో రోజు విపక్షాలు సమావేశమయ్యాయి. బెంగళూరులోని ఒక హోటల్‌లో మంగళవారం ఉదయం ప్రతిపక్ష పార్టీల నేతలు భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలను ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. సమిష్టిగా తీసుకోవాల్సిన అంశాలపై బ్లూప్రింట్ తయారుచేసేందుకు కమిటీ ఏర్పాటు కానుంది. కనీస ఉమ్మడి కార్యక్రమం స్ధానంలో లేవనెత్తాల్సిన ఉమ్మడి అంశాలను గుర్తించి జాబితా రూపొందించేందుకు కమిటీని నియమించే అవకాశం ఉంది. యూపీఏ పేరు మార్పు విషయంలోనూ విపక్షాల సమావేశంలో నేతలు కసరత్తు సాగిస్తున్నారు. నాలుగైదు పేర్లను పరిశీలిస్తున్న నేతలు.. నేడు నూతన కూటమి పేరును ప్రకటించే అవకాశం ఉంది. కూటమి పేరులో ఫ్రంట్ అనే పదం వాడరాదని టీఎంసీ సమావేశంలో సూచించినట్టు తెలిసింది. సమావేశానికి ముందు కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ మృతికి నేతలు సంతాపం ప్రకటించారు. దివంగత నేత మృతికి సంతాపంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించామని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. సమావేశం అనంతరం విపక్షాల భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలను నేతలు విలేకరుల సమావేశంలో వెల్లడించనున్నారు.