Site icon NTV Telugu

Nav Sankalp Shivir : అన్ని రాష్ట్రాల్లో రాహుల్ 90 కిలోమీటర్ల పాదయాత్ర

Congress

Congress

వరుస ఓటములతో సతమతమవుతోన్న కాంగ్రెస్‌.. పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీని కోసం కాంగ్రెస్‌ అధిష్టానం.. 3 రోజుల పాటు ‘నవ సంకల్ప్‌ చింతన్‌ శిబిర్‌-2022’ పేరిట రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా మేధోమథన సదస్సు నిర్వహించింది. ఈ సదస్సు ఈ నెల 13న ప్రారంభం కాగా.. నేడు ముగిసింది. అయితే.. ఈ “నవ సంకల్ప్ శిబిర్” సదస్సులో పలు కీలక నిర్ణయాలు కాంగ్రెస్‌ అధిష్టానం తీసుకుంది.

అవి.. ఒక కుటుంబానికి ఒక టిక్కెట్. 50 ఏళ్ల లోపు నాయకులకు 50 శాతం పార్టీలో సంస్థాగత పదవులు (బ్లాకు స్థాయి నుంచి సీడబ్ల్యూసీ వరకు), 50 ఏళ్ల వయస్సు లోపు నాయకుల్లోనే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళలకు అవకాశం. పార్టీ పదవుల్లో 5 ఏళ్లు కొనసాగింపు. తర్వాత 3 ఏళ్ల పాటు విరామం. అన్ని రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ 90 కిలోమీటర్ల పాదయాత్ర. అని నిర్ణయాలు తీసుకున్నట్లు కాంగ్రెస్‌ వెల్లడించింది.

Exit mobile version