NTV Telugu Site icon

TG Congress MPs: కేంద్ర బడ్జెట్‌ లో తెలంగాణకు అన్యాయం.. ఢిల్లీలో కాంగ్రెస్‌ ఎంపీల ధర్నా..

Congress Mps In Dhilhi

Congress Mps In Dhilhi

TG Congress MPs: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో నాగర్ కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ పాల్గొన్నారు. తెలంగాణ కు బడ్జెట్ లో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ప్రధాని, కేంద్ర ఆర్ధికశాఖ మంత్రికి లేఖలు రాస్తున్నామని నాగర్ కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులను మేము వ్యతిరేకించడం లేదన్నారు. తెలంగాణకు కేటాయింపులు జరపమని కోరుతున్నామన్నారు. రాష్ట్రప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్, బీజెపీతో రాజీపడిందన్నారు. బడ్జెట్ పై చర్చ సంధర్భంగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని లేవనెత్తుతామన్నారు. తెలంగాణకు న్యాయం జరిగేంతవరకు పార్లమెంట్ లో పోరాటం చేస్తామన్నారు. తెలంగాణలోని పాత జిల్లాల్లో 9 జిల్లాలకు వెనుకబడిన ప్రాంత నిధులు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఆ హామీ గురించి ఎటువంటి ప్రస్తావన లేదన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే అమలు చేసేలా బడ్జెట్ లో హామీలు, కేటాయింపులు ఉన్నాయని అన్నారు

Read also: Jurala Project: జూరాల ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తివేత.. హెచ్చరికలు జారీ..

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని బిజెపి ఎంపీలు వమ్ము చేశారని తెలిపారు. తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నప్పటికీ న్యాయం జరగలేదన్నారు. 2014 నుంచి విభజన చట్టం లోని పలు అంశాలపై ఏనాడు లేని కేటాయింపులు ఈసారి బడ్జెట్ లోనే ఎందుకు చేశారు..!? అని ప్రశ్నించారు. ప్రధాని తన కుర్చీ కాపాడుకునేందుకే బడ్జెట్ లో నితీశ్, చంద్రబాబు రాష్ట్రాలకు న్యాయం చేశారు. లోకసభ ఎన్నికల్లో బిజెపికి సహకరించిన బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే బిజెపి ఎమ్.పిలు తెలంగాణకు జరిగిన అన్యాయం పై పోరాటం చెయ్యాలని తెలిపారు.

Read also: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కు ‘గోల్డెన్’ న్యూస్.. నేడు తులంపై వెయ్యి తగ్గింది! 8 రోజుల్లో 5 వేలు

ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ రెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే బిజెపి ఎమ్.పిలు కనీసం నిరసన కూడా తెలపకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని అన్నారు. తెలంగాణ బీజేపీ ఎమ్.పిలను ఊళ్ళల్లో ప్రజలు తిరగనివ్వద్దన్నారు. తెలంగాణ కు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది . ఈ పోరాటంలో బీజేపీ ఎంపీలు కలసి రావాలన్నారు.

Read also: Madanapalle Incident: మదనపల్లె సబ్ కలెక్టరేట్‌ ఘటనలో 37 మందిని విచారించనున్న పోలీసులు

వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. నిన్నటి కేంద్ర బడ్జెట్ తెలంగాణ ప్రజలకు చీకటిరోజన్నారు. ఆంధ్ర కోడలు అయిన నిర్మలా సీతారామన్ తెలంగాణ పై బడ్జెట్ లో వివక్ష చూపారని తెలిపారు. భారతదేశం అంటే కేవలం ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలే నా…!? అని ప్రశ్నించారు.* బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై బిజెపి ఎంపీలను, కేంద్ర మంత్రులను బీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. భారతదేశంలో రెండవ అతి పెద్దజాతర అయిన “సమ్మక్క- సారక్క” జాతరకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వడం లేదన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకు జాతీయ హోదా ఇవ్వడం లేదని తెలిపారు. ప్రధాని, కేంద్రమంత్రులను సి.ఎమ్ రేవంత్ రెడ్డి కలిసి, అభ్యర్ధించినా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు ప్రయోజనం లేదని తెలిపారు.

Read also: Kiran abbavaram : కుమ్మేసిన కిరణ్ ‘క’ థియేట్రికల్ బిజినెస్ ..!

జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ మాట్లాడుతూ.. బడ్జెట్ లో తెలంగాణ కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ఢిల్లీ వేదికగా ధర్నా చేద్దామన్నారు. కేసీఆర్ వస్తే, రేవంత్ రెడ్డి కూడా వస్తారన్నారు. జంతర్ మంతర్ లో ధర్నా చేసి కేంద్రాన్ని నిలదీద్దామన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా ధర్నా లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
MV Maersk Frankfurt Ship Fire: కార్గో షిప్‌లో మంటలు.. హెలికాప్టర్ల సాయంతో ఆరో రోజు కొనసాగుతున్న ఆపరేషన్