Site icon NTV Telugu

Shashi Tharoor: మోడీ-ట్రంప్ భేటీపై కాంగ్రెస్ ఎంపీ ప్రశంసలు.. హుందాగా ఉందని కితాబు

Shashitharoor

Shashitharoor

ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. ట్రంప్‌తో మోడీ చర్చలు భారత్‌కు ప్రోత్సాహకరంగా.. ఆందోళనలు పరిష్కరించేవిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇక ట్రంప్‌తో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో మోడీ హుందాగా నడుచుకున్నారని కితాబు ఇచ్చారు. ఇక అమెరికా నుంచి పంపించేస్తున్న భారతీయుల పట్ల సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా ఈ సమావేశం దేశం ఎదురు చూస్తున్న అనేక సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా విధిస్తున్న సుంకాలపై మనం కూడా తొందరపాటు చర్యలు తీసుకుంటే ఆ ప్రభావం దేశం నుంచి ఎగుమతయ్యే ఉత్పత్తులపై పడే అవకాశం ఉందని శశిథరూర్ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Sanam Teri Kasam: పాకిస్థానీ నటి “సరస్వతి” పాత్రలో నటించి సినిమా.. రీ-రిలీజ్‌లో భారీ వసూళ్లు..

ప్రధాని మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా అధ్యక్షుడు ట్రంప్‌తో సహా పలువురు కీలక నేతలతో మోడీ సమావేశం అయ్యారు. ట్రంప్‌తో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై మోడీ చర్చించారు. ఇక అక్రమ వలసదారులపై మోడీ మాట్లాడుతూ.. చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని వెల్లడించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని, ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. అయితే మోడీ చేసిన వ్యాఖ్యలను శశిథరూర్‌ సమర్థించారు. యువత తప్పుడు దారిలో అక్రమంగా విదేశాలకు వెళ్తున్నారని.. అలా వెళ్లిన భారత పౌరులను తిరిగి తీసుకురావాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమ వలసలను నివారించడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఎఫ్‌-35 యుద్ధ విమానాలను అమెరికా ఆఫర్‌ చేయడాన్ని భారత్‌కు శుభ పరిణామంగా శశిథరూర్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Chintamaneni: సీఎం చంద్రబాబుతో చింతమనేని భేటీ.. తాజా పరిణామాలపై కీలక చర్చ

Exit mobile version