NTV Telugu Site icon

Rahul Gandhi: యువతకు ఉద్యోగాలెక్కడా? బీహార్ ప్రభుత్వాన్ని నిలదీసిన రాహుల్‌గాంధీ

Rahulgandhi1

Rahulgandhi1

యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా బీహార్ ప్రభుత్వం పారిపోతుందని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. నేషనల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా ఇన్‌ఛార్జ్ కన్హయ్య కుమార్‌ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రలో రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యువతకు ఉద్యోగాలు ఎక్కడా? అని ప్రశ్నించారు. బీహార్ ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతలు పారిపోవద్దని.. యువతకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలు విని ఇకపై ప్రజలు మోసపోరని చెప్పారు. తమ భవిష్యత్‌ను రాసుకోవడానికి బీహార్ యువత సిద్ధంగా ఉందని తెలిపారు.

ఇది కూడా చదవండి: AP Capital: అమరావతికి కేంద్రం గుడ్‌న్యూస్‌.. రూ.4,285 కోట్లు విడుదల..

ఇక పాదయాత్రలో పాల్గొనేవారంతా తెల్లటి టీ-షర్టులు ధరించి.. హక్కుల కోసం గొంతు విప్పాలని యువతకు రాహుల్‌గాంధీ ఆదివారం పిలుపునిచ్చారు. యువత పోరాటాన్ని.. ప్రపంచ మొత్తం చూసేలా చేయడమే లక్ష్యమని పేర్కొ్న్నారు. ఎన్డీఏ కూటమిని అధికారంలోంచి దించేందుకు యువత నడుం బిగించాలని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. బీహార్‌ను అవకాశాల రాష్ట్రంగా మారుద్దామని కోరారు.

ఇది కూడా చదవండి: MLA Medipally Sathyam: కేసీఆర్ రాములవారిని అవమానించారు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

ఇక పాదయాత్ర తర్వాత పాట్నాలోని శ్రీ కృష్ణ మెమోరియల్ హాల్‌లో జరిగే రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో పాల్గొంటారు. అనంతరం గాంధీ సడకత్ ఆశ్రమంలో కాంగ్రెస్ నాయకులను కలుస్తారు. సాయంత్రం 4:10 గంటలకు ఢిల్లీకి తిరిగి వెళతారు. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రీయ జనతాదళ్, వామపక్ష పార్టీలతో కూడిన మహాఘట్బంధన్‌లో కాంగ్రెస్ భాగంగా ఉంది.