NTV Telugu Site icon

Lionel Messi: మెస్సీ అస్సాంలో పుట్టాడు.. కాంగ్రెస్ ఎంపీ ట్వీట్ వైరల్

Messi Born Assam

Messi Born Assam

Congress MP Abdul Khaleque Claims Lionel Messi Born In Assam: ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఏ దేశస్థుడు అని అడిగితే.. ఫుట్‌బాల్ క్రీడపై అవగాహన (లేని వాళ్లు కూడా) ఉన్న ప్రతిఒక్కరూ అర్జెంటీనాకు చెందినవాడని ఠక్కున చెప్తారు. కానీ.. కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎంపీ మాత్రం మెస్సీ మన భారత్‌లోని అస్సాం గడ్డపై పుట్టిన బిడ్డ అని పేర్కొంటున్నారు. ఆ ఎంపీ పేరు అబ్దుల్ ఖాలిక్. ఈయన అస్సాంలోని బార్‌పేట నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా విశ్వ విజేతగా నిలిచిన తరుణంలో.. ట్విటర్ మాధ్యమంగా ఆయన మెస్సీని అభినందించారు. అంతటితో ఆగకుండా.. అస్సాంతో నువ్వు (మెస్సీ) కనెక్షన్ కలిగి ఉండటంతో, మేము గర్వంగా భావిస్తున్నామంటూ ట్వీట్ చేశారు. ఆయన ఇలా ట్వీట్ చేయడమే ఆలస్యం.. అది క్షణాల్లోనే వైరల్ అయ్యింది.

Dalai Lama: చైనాకు తిరిగెళ్లే ప్రసక్తే లేదు.. భారత్‌లోనే ఉంటా

మరింత జుగుప్సాకరమైన విషయం ఏమిటంటే.. ఓ నెటిజన్ ఖాలిక్‌ను ‘ఏంటి, మెస్సీకి అస్సాంతో కనెక్షన్ ఉందా?’ అంటూ ప్రశ్నించాడు. ఇందుకు ఆయన ‘అవును, మెస్సీ పుట్టింది మన అస్సాంలోనే’ అంటూ నొక్కి వక్కానించారు. ఇంకేముంది.. ట్రోలర్స్ ఆయనపై ఎగబడటం మొదలుపెట్టారు. తమదైన శైలిలో సెటైర్లు వేస్తూ.. ఆ ఎంపీతో ఓ ఆటాడుకుంటున్నారు. మరో నెటిజన్ అయితే.. ‘అవును సార్, నేను మెస్సీ క్లాస్‌మేట్స్’ అంటూ వ్యంగ్యంగా రియాక్ట్ అయ్యాడు. మరొక నెటిజన్ అయితే.. తాను అస్సాంలో పుట్టిన విషయం మెస్సీకి ఇప్పుడే తెలిసిందన్నట్టు సెటైరికల్‌గా ట్వీట్ చేశాడు. కానీ, కొందరు మాత్రం కొంచెం సీరియస్‌గానే స్పందించారు. ఎంపీ స్థాయిలో ఉండి, మెస్సీ లాంటి గొప్ప ఆటగాడు ఏ దేశస్తుడో కూడా తెలియకపోతే ఎలా? అంటూ నిలదీస్తున్నారు. ఇలాంటి వాళ్లా మనల్ని పాలిస్తోందా? అంటూ అసంతృప్తులు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కొద్దిసేపటి తర్వాత అసలు విషయం తెలిసి, ఆ ఎంపీ తన ట్వీట్ డిలీట్ చేశారు. కానీ, ఈలోపు జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది.