NTV Telugu Site icon

Congress: పాకిస్తాన్ అంటే కాంగ్రెస్‌కి చాలా ప్రేమ.. ఇఫ్తార్ విందుకి వెళ్లడంపై బీజేపీ ఫైర్..

Congress

Congress

Congress: కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పాకిస్తాన్ ఫ్రెండ్లీ పార్టీ(పీపీపీ) అని బీజేపీ విమర్శించింది. పాకిస్తాన్ దేశ జాతీయదినోత్సవం వేళ ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు వివాదాస్పదంగా మారింది. ఆ కార్యక్రమానికి ప్రముఖ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ హాజరైన తర్వాత బీజేపీ తీవ్రంగా విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ‘‘ఇది భారత జాతీయ కాంగ్రెస్ కాదు, ఇది పీపీపీ- పాకిస్తాన్ ఫ్రెండ్లీ పార్టీగా మారింది’’ అని దాడి చేసింది.

Read Also: Karnataka: కర్ణాటక అసెంబ్లీ నుంచి 6 నెలల పాటు బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..

అయితే, అధికార వర్గాల సమాచారం ప్రకారం, ప్రభుత్వ ప్రతినిధి ఎవరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. బీజేపీ నేత షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. మోడీ విరోధులు, దేశ విరోధులకు మధ్య సంబంధాలు ఉన్నాయని అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాకిస్తాన్‌ని ప్రేమిస్తుంది అని అన్నారు. మణిశంకర్ అయ్యర్ అయినా, కాంగ్రెస్‌లో ఏ నాయకుడైనా వారి గుండెల్లో పాకిస్తాన్ పట్ల ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది అని అన్నారు.

పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో నిర్వహించిన ఇఫ్తార్ పార్టీకి మణిశంకర్ అయ్యర్ వెళ్లడంపై నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఎక్స్‌లో ఓ యూజర్.. ‘‘ఆయన పాకిస్తాన్ ప్రేమికుడు’’ అని అన్నారు. మరొకరు అతను వాస్తవానికి లాహోర్‌లో(అతడి పూర్వీకుల ఇల్లు)కి వెళ్లి మిగిలిన రోజులు అక్కడే ప్రశాంతంగా గడపాలి అని చెప్పాడు.