Site icon NTV Telugu

Congress: రాహుల్‌ గాంధీ హత్యకు కుట్ర జరుగుతుంది.. పోలీసులకు ఫిర్యాదు..!

Rahul

Rahul

Congress: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హత్యకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్‌ ఆరోపణలు చేసింది. ఈ మేరకు పలువురు బీజేపీ నేతలపై ఈరోజు ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. అలాగే, ఫిర్యాదు ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అజయ్‌ మాకెన్‌ పంపారు. రాహుల్ గాంధీని ఉగ్రవాది అని పలువురు ఎన్డీఏ నేతలు వారి మిత్రపక్షాలు విమర్శించడంతో పాటు ఆయనపై దాడి చేస్తామని బెదిరింపులకు దిగారని చెప్పారు. పేదలు, దళితులు, మహిళలు, విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్‌ గాంధీ నిరంతరం ప్రశ్నిస్తున్నారు.. వారి సమస్యలను పరిష్కరించాలని మోడీ సర్కార్ పై ఒత్తిడి తెస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇది బీజేపీకి, దాని మిత్రవర్గాలకు నచ్చడం లేదు.. అందుకే రాహుల్‌పై ఇలాంటి విద్వేషపూరిత కామెంట్స్ చేస్తున్నారని.. అలాగే, ప్రజల్లో అశాంతి నెలకొనేలా చేయడానికి కుట్రలు పన్నుతున్నారని కంప్లైంట్ లో కాంగ్రెస్ పేర్కొనింది.

Read Also: Vettaiyan : రికార్డు సృస్టించిన రజనీ ‘ మనసిలాయో’ లిరికల్ సాంగ్

ఇక, సెప్టెంబరు 11వ తేదీన రాహుల్‌ గాంధీపై బహిరంగ బెదిరింపులకు పాల్పడిన బీజేపీ నేత తర్విందర్ సింగ్ మార్వా, రైల్వేశాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ బిట్టు, శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్‌ల పేర్లను కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో చేర్చారు. అలాగే, రాహుల్‌ గాంధీ నాలుకను ఎవరైనా కోసేస్తే వారికి రూ.11లక్షల రివార్డు ఇస్తామంటూ ఇటీవల మహారాష్ట్రలోని బుల్దానా నియోజకవర్గ శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ హాట్ కామెంట్స్ చేశారు. భారత్‌లో రిజర్వేషన్ల వ్యవస్థను తొలగించాలనే ఆలోచనలో ఉన్నట్లు విదేశీ పర్యటనలో రాహుల్ చేశాడని తెలిపాడు. దీన్నిబట్టి కాంగ్రెస్‌ అసలు రూపం బయటపడిందని గైక్వాడ్‌ మండిపడ్డారు. రాహుల్‌ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గైక్వాడ్ పై కేసు నమోదైంది. కాంగ్రెస్‌ శ్రేణుల ఫిర్యాదుతో బుల్దానా నగర పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ ఫైల్ చేశారు.

Exit mobile version