NTV Telugu Site icon

Congress: తమిళనాడులో 2019 ఫార్ములా రిపీట్.. 9 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ..

Tamil Nadu

Tamil Nadu

Congress: తమిళనాడు, పుదుచ్చేరిలో కాంగ్రెస్-డీఎంకే పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ప్రకటించారు. సీట్ల షేరింగ్ ప్రకారం మరోసారి డీఎంకే 2019 ఫార్ములాను రిపీట్ చేసింది. మరోసారి కాంగ్రెస్‌కి తమిళనాడులో 9 ఎంపీ స్థానాలను కేటాయించింది. ఇక పుదుచ్చేరిలోని ఒక స్థానంలో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. 2019 ఎన్నికల్లో 39 లోక్‌సభ స్థానాల్లో 38 సీట్లను డీఎంకే కూటమి గెలుచుకుంది. కాంగ్రెస్ ఆ సమయంలో 9 స్థానాలకు గానూ 8 స్థానాల్లో గెలిచింది.

Read Also: BJP: మళ్లీ ఎన్డీఏదే అధికారం, బీజేపీకి 333కి పైగా సీట్లు.. తాజా సర్వేలో వెల్లడి..

డీఎంకే, కాంగ్రెస్‌లు కలిసి పోటీ చేస్తాయని కేసీ వేణుగోపాల్ చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరిలోని 40 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రాలపై బీజేపీ దాడి చేస్తుందని బీజేపీపై ఆరోపణలు చేశారు. సీఎం స్టాలిన్ నేతృత్వంలో తమిళనాడు దేశ విభజన శక్తులకు, కేంద్ర ప్రభుత్వ ఫెడరల్ వ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా పోరాడుతుందని అన్నారు. తమిళనాడు గౌరవంపై బీజేపీ దాడి చేసే ప్రయత్నం చేస్తో్ందని విమర్శించారు. మరోవైపు ప్రముఖ నటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ కూడా డీఎంకేకి మద్దతు పలికింది. గత నెలలో డీఎంకే సీపీఎం, సీపీఐలకు రెండు లోక్‌సభ సీట్లను కేటాయించింది.