NTV Telugu Site icon

Delhi Mayor Polls: ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో గందరగోళం.. కాంగ్రెస్ కౌన్సిలర్ రాజీనామా..

Delhi Mayor Polls

Delhi Mayor Polls

Delhi Mayor Polls: ఢిల్లీ మేయర్ ఎన్నికల ముందు గందరగోళం నెలకొంది. దళితుడు అయిన కొత్త మేయర్ పూర్తి కాలం పదవీకాలంలో కొనసాగాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎన్నికలను బహిష్కరించింది. ఈ రోజు ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో గలాటా చోటు చేసుకుంది. సాధారణంగా ప్రతీ ఏప్రిల్‌లో నిర్వహించే ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బీజేపీ మధ్య పోరుతో ఆలస్యమైంది. కొత్త మేయర్‌కి మరో 5 నెలల పదవీ కాలం మాత్రమే లభిస్తుంది.

కాంగ్రెస్‌కు చెందిన మహ్మద్ ఖుష్నూద్ భార్య సబిలా బేగం, ముస్తఫాబాద్ వార్డు 243 కౌన్సిలర్ అయిన ఆమె, ఆప్ అభ్యర్థికి ఓటు వేస్తామని చెప్పి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఓటింగ్ ప్రారంభం కాగానే ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేయగా, ఆమె ఓటు వేయలేదు. పార్టీ వాకౌట్ నిర్ణయంపై ఆమె మాట్లాడుతూ.. పార్టీ వాకౌట్ నిర్ణయంపై తన అభ్యంతరం బీజేపీకి మాత్రమే మేలు చేస్తుందని సబిలా బేగం తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

Read Also: CM Chandrababu: సినిమాల్లో ఆ ‘ఆర్ఆర్ఆర్‌’.. రాజకీయాల్లో ఈ ‘ఆర్ఆర్ఆర్‌’ సంచలనం..

‘‘కొద్ది రోజుల క్రితం స్టాడింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక జరగాల్సి ఉండగా, అందులోనూ కాంగ్రెస్ కౌన్సిలర్లను వాకౌట్ చేయాలని ఆవేశాలు జారీ చేయడంతో బీజేపీ అభ్యర్థి గెలుపొందింది. గత మేయర్ ఎన్నికల్లో కూడా మేము పార్టీ ఆదేశానుసారం వాకౌట్ చేశాము. దాని కారణంగా మా వార్డులోని మా ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది’’ అని ఆమె లేఖలో పేర్కొంది. ‘‘నేను మున్సిపల్ కౌన్సిలర్‌గా ఉన్న వార్డు ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం కాబట్టి, ఆ ప్రాంత ప్రజలు బీజేపీకి ఏ విధంగానూ మద్దతు ఇవ్వలేరు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను’’ అని లేఖలో పేర్కొన్నారు.

రాబోయే పదవీకాలం రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థి కోసం ఉద్దేశించబడింది. ప్రతీ ఏడాది ఎన్నికల్లో రొటేషన్ ప్రాతిపదికన కేటగిరీలు ఉంటాయని నిబంధనలు చెబుతున్నాయి. మొదటి ఏడాది మహిళకి, రెండో ఏడాది ఓపెన్ కేటగిరి, మూడో ఏడాది రిజర్వ్డ్ కేటగిరీ, చివరి రెండు మళ్లీ ఓపెన్ కేటగిరీకి కేటాయించబడ్డాయి. ఆప్‌కి చెందిన దేవ్‌నగర్ కౌన్సిలర్ మహేష్ ఖిచినీ మేయర్ పదవి కోసం చూస్తున్నాడు. బీజేపీ కిషన్ లాల్‌పై పోటీ చేశారు. ప్యూటీ మేయర్ పదవి కోసం ఆప్‌కి చెందిన రవీందర్ భరద్వాజ్, అమన్ విహార్ కౌన్సిలర్ నీతా బిష్త్ మధ్య పోరు నెలకొంది.డిసెంబర్ 2022లో 15 ఏళ్ల బీజేపీ ప్రస్థానాన్ని ముగించి ఆప్ ఢిల్లీ కార్పొరేషన్‌ని సొంతం చేసుకుంది. ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడో సారి మేయర్ ఎన్నిక. ఆప్‌కి చెందిన షెల్లీ ఓబెరాయ్ మేయర్ పదవి నుంచి దిగిపోతారు.

Show comments