గవర్నర్ వ్యవస్థపై కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల్లో గవర్నర్ పదవిని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎలాంటి రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాకుండా.. న్యూట్రల్‌గా ఉండి చిల్లర రాజకీయాలు చేయనటువంటి వ్యక్తిని గవర్నర్‌గా నియమించాలని కోరారు. పలు రాష్ట్రాల్లో అధికార ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ అభిషేక్ మను సింఘ్వీ ఈ వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ సింఘ్వీ ఇటీవలే తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా స్పీకర్, చైర్మన్ కూడా పక్షపాతం లేకుండా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Telangana Rains: రేపు 11 జిల్లాల్లో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులపై కీలక ఆదేశాలు
ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ సింఘ్వీ మాట్లాడారు. ‘‘ఈ ప్రభుత్వం అతిపెద్ద వైఫల్యం ఏమిటంటే.. ప్రతీ సంస్థను కించపర్చటం, దాని విలువ తగ్గించటం. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు రెండో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే గవర్నర్ పదవిని పూర్తిగా రద్దు చేయాలి. లేదంటే రాజకీయలకు సంబంధంలేని వ్యక్తిని మాత్రమే నియమించాలి. ఒకవేళ రాష్ట్ర ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు మధ్య విభేదాలు తలెత్తితే వెంటనే గవర్నర్‌ను తొలగించాలి. ఎందుకంటే ఎన్నికల ప్రకియలో ప్రజలు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు కానీ గవర్నర్ కాదు. ప్రస్తుతం గవర్నర్ల తీరు వల్ల పరిపాలన కష్టంగా మారుతోంది. ప్రభుత్వం చేసే కొన్ని ముఖ్యమైన బిల్లులను గవర్నర్లు ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారు’’ అని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: “పార్టీ చాలా ఓర్చుకుని ఈ స్థాయికి చేరుకుంది”: బీజేపీ మెంబర్‌షిప్ క్యాంపెయిన్ లో మోడీ
తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రభుత్వానికి-గవర్నర్ మధ్య వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో అభిషేక్ సింఘ్వీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయంశంగా మారాయి. ఇక తాజాగా దేశంలో జరుగుతున్న ఎన్నికలపై కూడా ఆయన స్పందించారు. హర్యానా, జమ్మూ కాశ్మీర్, తర్వాత జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ… ఎన్నికల గురించి బీజేపీకి చాలా భయంగా ఉందని తెలిపారు. హర్యానా, మహారాష్ట్రలో బీజేపీ ఘోరంగా ఓడిపోతుందని జ్యోసం చెప్పారు. ‘లాడ్లీ బెహనా’ పథకంపై సమయం అవసరమైనందున మహారాష్ట్రలో ఎన్నికలు వాయిదా పడ్డాయని సింఘ్వీ అన్నారు.
ఇది కూడా చదవండి: TMC Leader: “మీ ఇంట్లోకి దూరి మీ తల్లులు, అక్కాచెల్లెళ్ల అసభ్యకరమైన ఫోటోలు తీస్తాం..”