NTV Telugu Site icon

Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇందుకే పెళ్లి చేసుకోవట్లేదట..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: 5 రాష్ట్రాల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చాలా కీలకం కాబోతున్నాయి. ఇదిలా ఉంటే ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని మహారాణి కళాశాల విద్యార్థులతో సమావేశం కావడాన్ని, వారు అడిగిన ప్రశ్నలకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ నెటిజన్లతో పంచుకున్నారు. సెప్టెంబర్ 23న జరిగి ఈ ఇంటారక్షన్‌ని రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారంలో షేర్ చేశారు. ఈ సమావేశంలో మహిళా విద్యార్థినులు రాహుల్ గాంధీకి పలు ప్రశ్నలు సంధించారు. కులగణన, స్వాతంత్ర్య పోరాటంలో మహిళల పాత్ర, ఆర్థిక స్వాతంత్య్రం, రాహుల్ గాంధీ ఇష్టాల గురించి పలు కీలక విషయాలను పంచుకున్నారు.

Read Also: Israel-Hamas: ఇజ్రాయిల్‌పై దాడిలో మా ప్రమేయం లేదు.. ఇరాన్ సుప్రీం లీడర్ కీలక వ్యాఖ్యలు..

మీరు చాలా హుషారుగా అందంగా ఉన్నారు.. పెళ్లి ఎందుకు చేసుకోలేదని ఒక మహిళ రాహుల్ గాంధీని ప్రశ్నించింది. ‘‘నేను పూర్తిగా పనిలో కాంగ్రెస్ పార్టీలో చిక్కుకుపోయారు’’ అని రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు. ఇష్టమైన వంటకాలను గురించి ప్రశ్నించగా.. చేదు, పాలకూర, శనిగలు తప్పా అన్నింటిని బాగానే ఇష్టపడతానని సమాధానం ఇచ్చారు. తాను ఎప్పుడూ కొత్త ప్రదేశాలను చూడాలని అనుకుంటన్నాని తెలిపారు.

తన ముఖానికి క్రీములు, సబ్బులు వాడనని నీటితో కడుక్కుంటానని తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమంలో మహిళల పాత్ర కూడా తక్కువ కాదు కాబట్టి వారికి ఎందుకు తక్కువ హక్కులు ఉండాలని ప్రశ్నించారు. మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం గురించి మాట్లాడారు. మహిళలు డబ్బు విలువను అర్థం చేసుకోవాలని, అప్పుడే స్వతంత్రంగా ఎదుగుతారని రాహుల్ గాంధీ అన్నారు.