NTV Telugu Site icon

మళ్లీ పెరిగిన కోవిడ్‌ కేసులు.. అక్కడ 2 రోజులు పూర్తిగా లాక్‌డౌన్‌..!

Kerala

Kerala

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి.. కరోనా థర్డ్ వేవ్‌ ఇప్పటికే ప్రారంభమైందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి… ఇక, కేరళలో సెకండ్‌ వేవ్‌లో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఈ మధ్య కాస్త తగ్గుముఖం పట్టినా.. మరోసారి భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.. దీంతో.. అప్రమత్తమైన ప్రభుత్వం.. వీకెండ్‌లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయానికి వచ్చింది.. ఈ నెల 24, 25 తేదీల్లో (శనివారం, ఆదివారం) పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ విధించనున్నారు.. ఇక, టెస్ట్‌ల సంఖ్య కూడా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.. శుక్రవారం రోజు అదనంగా 3 లక్షల నిర్ధారణ పరీక్షలు చేయాలని అధికారులు సూచించారు. పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువ ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. తాజాగా కేరళలో 17 వేలకు పైగా కొత్త పాజిటివ్‌ కేసులు వెలుగు చూడగా.. మరో 105 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.