Site icon NTV Telugu

Vijay: టీవీకే చీఫ్‌ విజయ్‌కు చుక్కెదురు.. స్టాలిన్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తిరుచ్చిలో ఫిర్యాదు

Vijay

Vijay

టీవీకే చీఫ్ విజయ్‌కు చుక్కెదురైంది. సీఎం స్టాలిన్, కుటుంబ సభ్యులపై కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ విజయ్‌పై తిరుచ్చి ఎస్పీ కార్యాలయంలో డీఎంకే న్యాయవాది ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: India: పాక్ ప్రోత్సాహంతోనే భారత్‌లో ఉగ్ర దాడులు.. యూఎన్‌లో షరీఫ్ ప్రసంగాన్ని తిప్పికొట్టిన భారత్

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అతని కుటుంబంపై నటుడు, టీవీకే చీఫ్ విజయ్ పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ డీఎంకే న్యాయవాది ఎన్ మురళీ కృష్ణన్ తిరుచ్చి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 20న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో టీవీకే చీఫ్ విజయ్ తన ప్రసంగంలో సీఎం స్టాలిన్, అతని కుటుంబంపై అవమానకరమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని కంప్లంట్‌లో ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. విజయ్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాడని.. తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఇది కూడా చదవండి: Uttar pradesh:నడిపేది.. బైక్ టాక్సీ .. సంపాదించేది నెలకు లక్ష

వచ్చే ఏడాది ప్రారంభంలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. మరోసారి అధికారం కోసం డీఎంకే.. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తున్నాయి. ఇంకోవైపు కొత్తగా పార్టీ స్థాపించిన విజయ్.. ఈసారి ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని చూస్తున్నారు.

Exit mobile version