Commonwealth Games: అదరగొట్టిన వెయిట్‌లిఫ్టర్లు.. ప్రధాని మోడీ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామన్వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే రెండు పతకాలను గెలుచుకోగా.. తాజాగా మరో పతకాన్ని ఇండియా కైవసం చేసుకుంది. భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఏకంగా స్వర్ణాన్ని గెలుచుకుంది. దీంతో భారత్ ఇప్పటి వరకు మూడు పతకాలను కైవసం చేసుకుంది. మీరాబాయి చాను ట్విటర్ వేదికగా ప్రధాని మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. మీరాబాయి చాను భారతదేశం మరోసారి గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు.బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో ఆమె స్వర్ణం గెలిచి కొత్త కామన్వెల్త్ రికార్డును నెలకొల్పినందుకు ప్రతి భారతీయుడు సంతోషిస్తున్నాడు. ఆమె విజయం అనేక భారతీయులకు, ముఖ్యంగా వర్ధమాన క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని మోడీ ట్విటర్ వేదిగా ప్రశంసించారు.
The exceptional @mirabai_chanu makes India proud once again! Every Indian is delighted that she’s won a Gold and set a new Commonwealth record at the Birmingham Games. Her success inspires several Indians, especially budding athletes. pic.twitter.com/e1vtmKnD65
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
— Narendra Modi (@narendramodi) July 30, 2022
బర్మింగ్‌హామ్‌లోని CWG లో రజత పతకాన్ని గెలుచుకున్నందుకు బింద్యారాణి దేవికి అభినందించారు. ఈ సాఫల్యం ఆమె దృఢత్వానికి నిదర్శనమని, ఇది ప్రతి భారతీయునికి ఎంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఆమె భవిష్యత్ ప్రయత్నాలకు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ట్విటర్ వేదిగా ప్రశంసించారు.
Congratulations to Bindyarani Devi for winning a Silver medal at CWG, Birmingham. This accomplishment is a manifestation of her tenacity and it has made every Indian very happy. I wish her the very best for her future endeavours. pic.twitter.com/4Z3cgVYZvv
— Narendra Modi (@narendramodi) July 31, 2022
ఇప్పటికే రజతం, కాంస్య పతకాలు గెలుచుకోగా.. ఇప్పుడు స్వర్ణాన్ని గెలుచుకున్నారు మీరాబాయి చాను. 49 కేజీల విభాగంలో స్నాచ్ లో 88 ఎత్తిన చాను, క్లీన్ అండ్ జర్క్ లో 113 కేజీల బరువును ఎత్తి రికార్డు క్రియేట్ చేసింది. మొత్తంగా 201 కిలోల బరువును ఎత్తి ఈ ఘనత సాధించింది. మొత్తంగా ఇప్పటి వరకు భారత్ మూడు పతకాలను సాధించింది. అంతకుముందు 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సార్గర్ రజత పతకాన్ని సాధించారు. 61 కేజీల విభాగంలో గురురాజ్ పూజరి కాంస్య పతకాన్ని సాధించారు. కాగా.. సంకేత్ తృటిలో స్వర్ణాన్ని కోల్పోయారు. మొత్తంగా 248 కేజీ బరువును ఎత్తి స్వర్ణానికి దగ్గర్లో ఆగిపోారు. స్నాచ్ లో 113 కేజీలు ఎత్తిన సర్గర్ క్లీన్ అండ్ జర్క్ లో మొదటగా 135 కేజీలు ఎత్తిన మహాదేవ్.. మిగిలిన రెండు ప్రయత్నాల్లో 139 కేజీలను ఎత్తలేకపోయాడు. దీంతో స్వర్ణం ఆశలు చేజారాయి. 61 కేజీల విభాగంలో బ్రాంజ్ మెడల్ అందుకున్న గురురాజ్ స్నాచ్ లో 118 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ లో 151 కిలోలను ఎత్తి మొత్తంగా 269 కిలోలు ఎత్తి మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
Commonwealth Games: ఇండియాకు నాలుగో పతకం.. బింద్యారాణి దేవికి సిల్వర్
తాజావార్తలు
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
-
Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!