NTV Telugu Site icon

Madhya Pradesh: ఎన్నికలకు రెండు నెలల ముందు బీజేపీకి భారీ ఎదురుదెబ్బ..

Bjp Mla

Bjp Mla

Madhya Pradesh: మరో రెండు నెలల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగబోతున్నాయి. గత నాలుగు పర్యాయాలుగా ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటోంది. అయితే ఈ సారి బీజేపీని గద్దె దించాలని కాంగ్రెస్ చూస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నికల ముందు బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రిజేంద్ర సింగ్ రఘువంశీ గురువారం పార్టీకి రాజీనామా చేవారు. బరువైన హృదయంతో బీజేపీకి, రాష్ట్ర కార్యవర్గ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. బీజేపీ పాలనలో కమీషన్ వర్ధిల్లుతోందని విమర్శలు చేశారు. గత ఐదేళ్లుగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు తన ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ అతను పట్టించుకోలేదని ఆరోపిస్తూ రాష్ట్ర బీజేపీ చీఫ్ వీడీ శర్మకు లేఖ రాశారు.

Read Also: Parliament Session: వినాయక చతుర్థి సమయంలో పార్లమెంట్ సమావేశాలేంటి..? విపక్షాల విమర్శలు..

కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరినప్పటి నుంచి తనను, తన కార్యకర్తలను వేధిస్తున్నారని కొలారస్, శివపురి ప్రాంతాల్లో అవినీతి అధికారులను నియమిస్తున్నారని, ఇదంతా సింధియా ఆదేశానుసారం జరుగుతోందని ఆయన ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని సింధియా బీజేపీలో చేరారని, అయితే ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం లేదని రఘువంశీ విమర్శించారు.

శివపురితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సహకార బ్యాంకుల్లో జమ చేసిన రైతుల సొమ్మును నాయకులు, అధికారులు కలిసి స్వాహా చేశారని ఆరోపించారు. కో ఆపరేటివ్ బ్యాంక్ కుంభకోణాన్ని అసెంబ్లీలో కూడా లేవనెత్తానని, అయితే ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రఘువంశీ ఆవేదన వ్యక్తం చేశారు.