Site icon NTV Telugu

Vande Bharat Train: “వందేభారత్ ట్రైన్” భోజనంలో బొద్దింక.. స్పందించిన రైల్వే..

Cockroach Found In Meal

Cockroach Found In Meal

Vande Bharat Train: మరోసారి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వార్తల్లో నిలిచింది. గతంలో పలుమార్లు ఈ రైలులో వడ్డించిన భోజనంలో దుర్వాసన రావడం, బొద్దింకలు, ఇతర కీటకాలు రావడంపై రైల్వే శాఖ విమర్శలను ఎదుర్కొంది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే ఎదురైంది. ఫిబ్రవరి 1న రాణి కమలాపతి నుంచి జబల్ పూర్ వెళ్తున్న ఓ ప్రయాణికుడికి రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అందించిన భోజనంలో చనిపోయిన బొద్దింక వచ్చింది.

Read Also: Uniform Civil Code Bill: యూసీసీ బిల్లు ఖురాన్‌కు విరుద్ధమైతే వ్యతిరేకిస్తాం..

దీంతో షాకైన ప్రయాణికుడు దానికి సంబంధించిన ఫోటోలను ఎక్స్(ట్విట్టర్)లో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది. డాక్టర్ శుభేందు కేశరి అనే ప్రయాణికుడు ఆర్డర్ చేసిన నాన్ వెజ్ భోజనంలో బొద్దింక ఉన్న దృశ్యాలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తాను ఆర్డర్ చేసిన భోజనంలో బొద్దింక రావడంపై తాను ఆందోళన చెందానని కేశరి తన పోస్టులో రాశాడు.

ఈ ఘటనపై IRCTC వెంటనే స్పందించింది. దీనిపై ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పింది. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌‌పై భారీ పెనాల్టీ విధించినట్లు తెలిపింది. ఈ ఘటనపై రైల్వే సేవా స్పందిస్తూ రైల్ మదాద్‌లో ఫిర్యాదు నమోదు చేసినట్లు తెలిపింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. జూలై నెలలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో భోపాల్ నుండి గ్వాలియర్‌కు ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు IRCTC అందించే భోజనంలో బొద్దింకను చూసి షాక్ అయ్యాడు. రైల్వేకి ఫిర్యాదు చేశాడు.

Exit mobile version