CM Yogi: ‘మీలా పాడలేను.. బుల్డోజర్ నడపగలను’.. కళాకారులతో సీఎం యోగీ కీలక సంభాషణ

  • దేశ వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
  • లక్నోలో ఆసక్తికర సన్నివేశం
  • ‘మీలా పాడలేను.. బుల్డోజర్ నడపగలను’
  • కళాకారులతో సీఎం యోగీ కీలక సంభాషణ
Upcm

Upcm

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. విధాన భవన్‌లో ఒక భారీ సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కళాకారులను, విద్యార్థులను పరామర్శించారు. అనంతరం కళాకారులు.. ముఖ్యమంత్రి యోగి చేపట్టిన బుల్డోజర్ చర్యను ప్రశంసించారు. దీనికి యోగి బదులిస్తూ.. ‘‘నేను మీకు లాగా పాడలేను.. అందుకే చెడ్డవారిపై బుల్డోజర్లను ఉపయోగిస్తానని హాస్యంగా వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.

శనివారం లక్నోలోని విధాన భవన్‌లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక జానపద కళాకారుడితో సరదాగా జరిపిన సంభాషణకు అక్కడున్న వారందరూ నవ్వు ఆపుకోలేకపోయారు. కళాకారుడు ఉత్తర ప్రదేశ్ శాంతిభద్రతలను, నేరస్థులపై బుల్డోజర్ చర్యను ప్రశంసించారు. దీనికి ముఖ్యమంత్రి బదులిస్తూ.. ‘‘నేను మీలా పాడలేను.. అందుకే దుర్మార్గులపై బుల్డోజర్లు నడుపుతాను.’’అని హాస్యంగా బదులిచ్చారు.

యోగి ఆదిత్యనాథ్ తన అధికారిక నివాసంలో కళాకారులు, విద్యార్థులందరినీ ప్రత్యేకంగా సత్కరించారు. కళ, ప్రతిభ ద్వారా దేశపు ఘనమైన సాంస్కృతిక వారసత్వానికి వేదికపై జీవం పోసినందుకు పాల్గొన్న వారందరినీ ముఖ్యమంత్రి హృదయపూర్వకంగా అభినందించారు.