CM Vijay Tiruchi Speech: తన డ్రెస్సింగ్ స్టైల్‌పై ట్రోల్స్ చేసినోళ్లకు సీఎం విజయ్ అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Vijay Tiruchi Speech: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఎక్కడికి వెళ్లినా, ఏ బహిరంగ సభలో పాల్గొన్నా ఒకే తరహా దుస్తుల్లో కనిపిస్తుండటం అందరినీ ఆకర్షిస్తోంది. ఆయన నిరంతరం నలుపు, తెలుపు రంగుల సూట్లు (Suits) ధరించడం వెనుక రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే తిరుచిలో జరిగిన భారీ బహిరంగ సభ వేదికగా సీఎం విజయ్ ఈ అంశంపై తొలిసారి నోరు విప్పారు. తన డ్రెస్సింగ్ స్టైల్‌ను విమర్శిస్తున్న వారికి తనదైన శైలిలో చురకలు అంటించారు.
సూట్లు వేసుకునే హక్కు వారికే ఉందా?
సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం విజయ్ మాట్లాడుతూ.. “ఈ రోజుల్లో నేను సూట్ వేసుకోవడంపై చాలా మంది రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు మేమెందుకు సూట్లు వేసుకోకూడదు? కోట్లు, సూట్లు వేసుకునే హక్కు కేవలం ఢిల్లీ పాలకులకో లేక శతాబ్దాలుగా అధికారంలో ఉన్నవారికే ఉందా? అది ఎంతమాత్రం నిజం కాదు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను వేర్వేరు రంగుల దుస్తులు మార్చకుండా, కేవలం నలుపు – తెలుపు రంగులనే ఎందుకు ఎంచుకుంటానో ప్రజలకు వివరిస్తూ.. “నా రాజకీయాలు, నా ఆలోచనలు, నా సిద్ధాంతాలు పూర్తిగా స్పష్టంగా ఉంటాయని చూపించడానికే నేను కేవలం ఈ రెండు రంగులను మాత్రమే ఉపయోగిస్తాను. నేను చేసే ప్రతి పనిలోనూ, తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ‘నలుపు-తెలుపు’ (Black and White) గానే ఉంటాను. అందులో ఎలాంటి బూడిద రంగు (గ్రే షేడ్స్/గందరగోళం) ఉండదు” అని స్పష్టం చేశారు. ర్యాలీకి పోటెత్తిన భారీ జనసమూహాన్ని చూపిస్తూ.. ఇక్కడున్న సామాన్య ప్రజలకు నలుపు రంగు దేనికి ప్రతీకగా నిలుస్తుందో (తమిళనాడు ద్రావిడ రాజకీయాల్లో నలుపు రంగు సామాజిక న్యాయం, నిరసనకు గుర్తు) బాగా తెలుసని సీఎం విజయ్ వ్యాఖ్యానించారు.
Also Read
- Mamata Banerjee: నాతో ఆడుకుంటున్నారు.. నాకు టైమొచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది.. బీజేపీకి మమత హెచ్చరిక
- El Nino-Centre: ఎల్‌నినోపై కేంద్రం అలర్ట్.. వాటి విషయంలో ఆందోళన అక్కర్లేదని భరోసా
- CM Vijay: తిరుచ్చిలో విజయ్ భారీ సభ.. సీఎంగా కాదు.. సేవకుడిగా వచ్చా.. అదే టార్గెట్..!
- Bengaluru Traffic: కడుపుతో ఉన్న భార్య కోసం ఖాకీలతోని కొట్లాట.. నడిరోడ్డుపై కూర్చున్న సామాన్యుడు! వీడియో వైరల్..
నెట్టింట వైరల్ అవుతున్న విజయ్ స్పీచ్
ముఖ్యమంత్రి విజయ్ విలక్షణమైన రూపంపై కొంతకాలంగా సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ వస్తున్న తరుణంలో.. తిరుచి ర్యాలీలో ఆయన ఇచ్చిన క్లారిటీతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రాజకీయాల్లో కపటత్వం లేకుండా, తన మనస్తత్వం లాగే తన దుస్తులు కూడా అంతే సూటిగా ఉంటాయని విజయ్ నిరూపించారని ఆయన మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం సీఎం విజయ్ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
తాజావార్తలు
-
CM Vijay Tiruchi Speech: తన డ్రెస్సింగ్ స్టైల్‌పై ట్రోల్స్ చేసినోళ్లకు సీఎం విజయ్ అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్.. !
-
Royal Challengers Bengaluru: ఆర్సీబీ విజయ రహస్యం విరాట్ కోహ్లీ కాదా..? ‘గుర్తింపు లేని ఈ హీరో’నేనా..?
-
Mamata Banerjee: నాతో ఆడుకుంటున్నారు.. నాకు టైమొచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది.. బీజేపీకి మమత హెచ్చరిక
-
Telangana Farmers: ఆ రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. టన్నుకు రూ.351 పెంపు..
-
Origin of Telangana: ‘తెలంగాణ’ పేరు ఎప్పడిదో తెలుసా? వందల ఏండ్ల కిందటి ఈ సీక్రెట్ హిస్టరీ సూస్తే మైండ్ పోవాల్సిందే!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!