CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
- మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
- గత సంస్కృతికి భిన్నంగా వ్యవహరించిన విజయ్
- తాజా ఎన్నికల్లో టీవీకే అభ్యర్థి చేతిలో ఓడిపోయిన స్టాలిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గత ముఖ్యమంత్రుల కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తమిళనాడు చరిత్రలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రత్యర్థులపై పగ ప్రతీకారాలు తీర్చుకునే సంస్కృతి ఉండేది. ఆ సంస్కృతికి గత స్టాలిన్ హయాంలోనే ఫుల్‌స్టాప్ పడింది. తాజాగా ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ అయితే మరింత భిన్నంగా నడుచుకుంటున్నారు.

Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
తాజా ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ సీఎం స్టాలిన్ నివాసానికి స్వయంగా సీఎం విజయ్ వెళ్లి పరామర్శించారు. విజయ్ ఇంటికి రాగానే స్టాలిన్ శాలువాతో సత్కరించారు. ముందుగా ఉదయనిధి స్టాలిన్ ఘనస్వాగతం పలికారు. అనంతరం స్టాలిన్ ఆలింగనం చేసుకున్నారు. స్టాలిన్‌ను కలిసి పలు సూచనలు, సలహాలు, అనుభవాలు కావాలని కోరినట్లుగా తెలుస్తోంది. సహజంగా ఓడిపోయిన ప్రత్యర్థుల ఇళ్లకు ఏ ముఖ్యమంత్రి వెళ్లరు. కానీ విజయ్ మాత్రం అందుకు భిన్నంగా స్టాలిన్ నివాసానికి వెళ్లి పరామర్శించడం దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారి తీసింది. ఇక స్టాలిన్‌ను కలిసిన అనంతరం మరో ఎండీఎంకే నేత వైకోను విజయ్ కలిశారు. ఇలా విపక్ష నేతలతో వరుసగా కలుస్తున్నారు.
మే 4న విడుదలైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. విజయ్ నేతృత్వంలోని టీవీకే మాత్రమే 108 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్‌కు 10 సీట్ల దూరంలో ఉండిపోయింది. దీంతో 5 రోజుల పాటు రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. పూర్తి మెజార్టీతో వస్తేనే ప్రమాణం చేయిస్తానని గవర్నర్ అర్లేకర్ తేల్చి చెప్పడంతో విజయ్ ప్రమాణస్వీకారం వాయిదా పడింది. దీంతో డీఎంకే కూటమిలో భాగమైన కాంగ్రెస్, వీసీకే, ముస్లిం లీగ్, వామపక్షాలు మద్దతు ఇవ్వడంతో విజయ్ బలం 120కి చేరింది. దీంతో ఆదివారం ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేశారు. ఇక సోమవారం ఉదయం ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు. తొలుత విజయ్ ప్రమాణం చేయగా.. అనంతరం మిగతా ఎమ్మెల్యేలంతా ప్రమాణం చేశారు.
#WATCH | Chennai: Tamil Nadu CM Vijay meets former CM and DMK President MK Stalin and former Dy CM Udhayanidhi Stalin at their residence.
(Source: DMK) pic.twitter.com/xsmH7uzoeZ
— ANI (@ANI) May 11, 2026
#WATCH | Chennai: Tamil Nadu CM Vijay leaves from the residence of former CM and DMK President MK Stalin. pic.twitter.com/Ji2mVUmJtf
— ANI (@ANI) May 11, 2026
#WATCH | Chennai: Tamil Nadu CM Vijay leaves after meeting MDMK founder Vaiko at his residence in Anna Nagar. pic.twitter.com/rqKp8ItH5z
— ANI (@ANI) May 11, 2026
மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சராகப் பொறுப்பேற்றுள்ள திரு. விஜய் அவர்கள் அரசியல் நாகரிகத்துடன் என்னைச் சந்தித்து வாழ்த்து பெற்றார்.
அவருக்கு என் அன்புநிறை வாழ்த்துகளையும், ஆலோசனைகளையும் வழங்கினேன்.@TVKVijayHQ @Udhaystalin pic.twitter.com/aTmmqpoPtP
— M.K.Stalin – தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) May 11, 2026
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!