CM Vijay: నీట్ పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పేపర్ లీక్‌లో మొత్తం పరీక్షనే రద్దు చేశారు. దీంతో 20 లక్షలకు విద్యార్థుల శ్రమ వృథా అయింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది, పలువురు నిందితుల్ని అరెస్ట్ చేసింది. ఇదిలా ఉంటే నీట్‌ను రద్దు చేయాలని తమిళనాడు చాలా ఏళ్లుగా కోరుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి నీట్ పేపర్ లీక్ వివాదం అస్త్రంగా మారింది.
నీట్ పేపర్ లీక్‌పై తొలిసారిగా సీఎం విజయ్ స్పందించారు. నీట్ విధానాన్ని రద్దు చేయాలని, అలాగే 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేయాడానికి రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని విజయ్ కోరారు. తమిళనాడుకు చెందిన అన్ని రాజకీయ పార్టీలు నీట్ పరీక్షను వ్యతిరేకిస్తున్నాయి. ఇది పట్టణ ప్రాంత విద్యార్థులకు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు మాత్రమే ఉపయోగపడుతోందని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అన్యాయం చేస్తోందని ఆరోపిస్తున్నారు.
Read Also: Ahmedabad: అమ్మ.. కిలాడీ.. చిరునవ్వుతో పని కానిచ్చేసింది.. వీడియో వైరల్
నీట్ పరీక్ష విధానంపై సీఎం విజయ్ ఎక్స్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ‘‘2024లో, ప్రశ్నపత్రం లీక్ అయ్యింది; ఆరు రాష్ట్రాల్లో FIRలు నమోదు చేయబడి, కేసు CBIకి బదిలీ చేయబడింది… ISRO మాజీ చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ, సంస్కరణల కోసం 95 సమగ్ర సిఫార్సులను సమర్పించింది. ఇదంతా జరిగినప్పటికీ, కేవలం రెండేళ్ల వ్యవధిలోనే మరోసారి ప్రశ్నపత్రం లీక్ అయ్యింది, దాంతో పరీక్ష రద్దు చేయబడింది’’ అని అన్నారు.
‘‘నీట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి తమిళనాడు ప్రభుత్వం దీనిని వ్యతిరేకిస్తూనే ఉంది. నీట్ ప్రవేశాలు గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలలు, తమిళ మీడియంలో చదువుకున్న, ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థుల్ని తీవ్రంగా నష్టపరుస్తోంది. నీట్ రద్దు చేయాలని, అలాగే ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులలో రాష్ట్ర కోటా కింద ఉన్న అన్ని సీట్లను 12 తరగతి మార్కుల ఆధారంగా భర్తీ చేసుకునే వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించాలని తమిళనాడు ప్రభుత్వం కోరుతోంది’’ అని ఆయన అన్నారు.
