Site icon NTV Telugu

Hijab: సీఎం సంచలన వ్యాఖ్యలు.. మేం తిరిగి అధికారంలోకి వస్తే..!

చదువుకోవాల్సిన విద్యార్థులు రోడ్లు ఎక్కుతున్నారు.. రచ్చ చేస్తున్నారు.. పాఠాలు చదివే వయస్సులో మత విధ్వేషాల్లో సమిధలు అవుతున్నారు.. ఇప్పుడు హిజాబ్ వివాదం కర్నాటకలో ప్రారంభమై దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ఈ అంశాన్ని పెద్దది చేయకండి అంటూ వ్యాఖ‍్యానించింది. అయితే, ఇదే సమయంలో.. అసెంబ్లీ ఎన్నికల వేళ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్‌లో మేం మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో యూనిఫామ్‌ సివిల్ కోడ్‌ను అమలుచేస్తామని ప్రకటించారు.. దీని కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు పుష్కర్‌ సింగ్‌ ధామీ.

Read Also: COVID 19: భారత్‌లో భారీగా తగ్గిన కేసులుhttps://ntvtelugu.com/india-reports-44877-new-covid19-cases-in-the-last-24-hours/

రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో తాము మరోసారి అధికారంలోకి వస్తే యూనిఫామ్‌ సివిల్ కోడ్‌ను తీసుకొస్తామని స్పష్టం చేశారు పుష్కర్‌ సింగ్‌ ధామీ.. యూనిఫామ్ సివిల్ కోడ్ ముసాయిదా కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ తరహా కోడ్‌ను అమలు చేయడం వల్ల రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ సమాన హక్కులు కలుగుతాయని పేర్కొన్నారు.. ఇది సామాజిక సామరస్యాన్ని పెంపొందించడమే కాకుండా మహిళా సాధికారత బలోపేతానికి దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. కాగా, నిన్నటితో ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ప్రచారానికి తెరపడగా.. రేపు (ఫిబ్రవరి 14న) పోలింగ్‌ నిర్వహించనున్నారు.. ఇక, మార్చి 10వ తేదీన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే.

Exit mobile version