Site icon NTV Telugu

సీఎంపై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు.. ఆయన గంజాయి తాగుతారు..!

Nitish Kumar

Nitish Kumar

రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు సర్వసాధారణం.. అయితే, కొన్ని సార్లు నేతలు చేసిన కామెంట్లు, ఆరోపణలు సంచలనంగా మారుతుంటాయి.. తాజాగా, బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌పై ప్రతిపక్ష ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలే చేశారు.. నితీష్‌ కుమార్‌ కూడా గంజాయి తాగుతారు. ఇది మత్తు కేటగిరి కిందకు వస్తుంది.. రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు, వినియోగం కూడా నిషేధించబడింది.. కానీ, ఆయన గంజాయి వ్యసనాన్ని ఎందుకు విడిచిపెట్టడం లేదు? అంటూ ప్రశ్నించారు.

రాష్ట్రంలో అమలు అవుతోన్న మద్యపాన నిషేధంపై స్పందిస్తూ.. అది కేవలం కంటితుడుపు చర్య మాత్రమే అని అభిప్రాయపడిన బెగుసరాయ్ జిల్లాలోని చెరియా బరియార్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్‌వంశీ.. బీహార్‌లోని ప్రతి గ్రామంలో, సిటీలో మద్యం అందుబాటులో ఉందని పేర్కొన్నారు.. నితీష్‌ కుమార్‌ కేవలం ప్రజలను మభ్యపెడుతున్నారంటూ విమర్శించిన ఆయన.. మద్యాన్ని నిషేధిస్తే సీఎం నితీష్‌ కుమార్‌ ఇతరులను ఎందుకు ప్రమాణం చేయమని బలవంతం చేస్తున్నారంటూ నిలదీశారు.. ఇక, ఆర్డేజీ నేత చిత్రాంజన్‌ గగన్‌ కూడా నితీష్‌పై ఇలాంటి వ్యాఖ్యలే చేవారు.. నితీష్‌కుమార్‌ గంజాయి మత్తు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉందని మండిపడ్డారు.

Exit mobile version