నిన్న రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే కేజ్రీవాల్ అపాయింట్మెంట్ ను సీఎంఓ అధికారులు అడిగారు. ఢిల్లీ నిర్మించ తలపెట్టిన టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించే ఛాన్స్ ఉంది.
అయితే రేపు ఎల్లుండి బీజేపీయేతర ముఖ్య నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. చివరి దశ యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో సమాజ్వాదీ పార్టీ నిర్వహించే పబ్లిక్ మీటింగ్ లో సీఎం కేసీఆర్ పాల్గొంటారట. ఇదిలా ఉంటే… వైద్య పరీక్షల నిమిత్తం ఢిల్లీకి వచ్చారు అని సీఎం వర్గాలు అంటున్నాయి.