Site icon NTV Telugu

CM KCR: బీజేపీ ముక్త్ భారత్ సాధించాలి.. అంతా కలిసి పనిచేస్తాం

Cm Kcr Patna

Cm Kcr Patna

దేశం బాగుపడాలంటే బీజేపీ ముక్త్ భారత్ సాధించాలన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. మోడీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదు..ధర్మం పేరుతో దేశంలో వైషమ్యాలు తీసుకువస్తున్నారు…మోడీ మేకిన్ ఇండియా ఎక్కడికి పోయింది ? దేశంలో వినాశకరమైన పరిస్థితిని బీజేపీ తీసుకువచ్చింది…విపక్షాలు ఒక్క తాటిపైకి రావాలని నితిష్‌ కుమార్ అన్నారు …విపక్షాలు కలసి బీజేపీ ముక్త్ భారత్ కోసం పనిచేయాలని అనుకున్నాం అన్నారు సీఎం కేసీఆర్..మోడీ మేకిన్ ఇండియా ఎక్కడికి పోయింది ? దేశంలో వినాశకరమైన పరిస్థితి ని బీజేపీ తీసుకువచ్చింది

విపక్షాలు ఒక్క తాటిపైకి రావాలని నితీష్‌ కుమార్ అన్నారు..విపక్షాలు కలసి బిజెపి ముక్త్ భారత్ కోసం పనిచేయాలని అనుకున్నాం..బిజెపి ముక్త్ భారత్ తోనే దేశంలో పురోగతి సాధ్యం అన్నారు కేసీఆర్. మోడీ విధానాలతో దేశం నుంచి వ్యాపారులు పారిపోతున్నారు..దేశంలో నీటి కోసం యుద్దాలు జరుగుతున్నాయి..దేశం అప్పులు పెరిగాయి…రూపాయి విలువ పడిపోయింది..దేశ రక్షణ వ్యవహారాల విషయంలో ఎటువంటి సంప్రదింపులు లేకుండా కొత్త విధానాలు తీసుకువస్తున్నారు.. దేశ రాజధానిలో ఇప్పటికి నీటి,కరెంట్ కొరత ఉంది… మోడీ సర్కార్ అసమర్థ విధానాలతో దేశం తిరోగమన దిశలో వెళ్తుందని దుయ్యబట్టారు సీఎం కేసీఆర్.

బీహార్ సీఎం నితీష్ కుమార్ సీఎం కేసీఆర్ ని ఆకాశానికెత్తేశారు. సీఆర్‌ గురించి అవగాహన లేని వారే మీ గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు…మీరు వారి విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు…మీరు ఆత్మస్థైర్యం కోల్పోకుండా పట్టుదలతో ముందుకు కొనసాగండి…మీ భాగస్వామ్యం చాలా గొప్పది…మీ ద్వారా తెలంగాణ అనే ఒక రాష్ట్రమే ఏర్పడింది….ఈ దేశంలో ఈ రకంగా పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మరెక్కడా లేదు…అలా ఒక రాష్ట్రాన్ని సాధించిన వారు మీరు ఒకే ఒక్కరు…మీరు ఒక రాష్ట్రాన్ని సాధించిన మహా నేత అని కొనియాడారు నితీష్ కుమార్.

అలాంటి మీ మీద ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటారు. వాళ్ళ విమర్శలన్నీ ఫాల్తు మాటలు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఎలా వదులుకుంటారు. వదులుకునే ప్రసక్తే ఉండదు. మీరు పట్టువదలకుండా మరింత శక్తి కూడగట్టుకొని మీ రాష్ట్రాభివృద్ధిని కొనసాగించండని కితాబిచ్చారు బీహార్ సీఎం నితీష్ కుమార్.బీజేపీ వ్యతిరేక కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై తొందర ఎందుకన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. విస్తృతంగా చర్చ జరిగాక నిర్ణయానికి వస్తాం. రైతులు ఇబ్బంది పడుతున్నారు. జాతీయ జెండాతో సహా అన్నీ చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు అంతా ఒక తాటిపైకి వచ్చాం.. తప్పుడు విద్యుత్ విధానం అమలుచేస్తోందన్నారు సీఎం కేసీఆర్.

Read Also: New Zealand: న్యూజిలాండ్‌కు షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్‌రౌండర్

 

Exit mobile version