దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం వెంటాడుతోంది. గాలి నాణ్యత కోల్పోవడంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాయు కాలుష్య నియంత్రణ కోసం కృత్రిమ వర్షాన్ని కురిపించాలని ఢిల్లీ ప్రభుత్వం పూనుకుంది. ఇందుకోసం రూ.3.21 కోట్లు కేటాయించింది.
ఇది కూడా చదవండి: Trump Dance: జపాన్‌లోనూ మరోసారి డ్యాన్స్‌తో అదరగొట్టిన ట్రంప్.. వీడియో వైరల్
ఇందులో భాగంగా మంగళవారం పలు ప్రాంతాల్లో క్లౌడ్ సీడింగ్ చేపట్టింది. విమానాల ద్వారా సిల్వర్ అయోడైడ్ కురిపించింది. కానీ క్లౌడ్ సీడింగ్ సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు. ఒక్క వాన చుక్క కూడా కురవలేదు. మంగళవారం చేపట్టిన ప్రయోగం ఫెయిల్ అయింది.
ఇది కూడా చదవండి: Gaza-Israel: గాజాలో మళ్లీ దాడులు.. 30 మంది మృతి
ఈ ప్రయోగంలో పాల్గొన్న ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మణీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ.. మేఘాల్లో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ప్రయత్నాలు విజయవంతం కాలేదని పేర్కొన్నారు. బుధవారం కూడా మరోసారి ప్రయోగిస్తామని చెప్పారు. బుధవరం చేపట్టే ప్రయోగం కచ్చితంగా సత్‌ఫలితం వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం 14 మంటలను పేల్చినట్లు అగర్వాల్ తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు శాశ్వత పరిష్కారం కాకపోయినా.. కొంత ఉపశమనం కలిగిస్తుందని వెల్లడించారు. ఇప్పుడు కాకపోయినా.. తర్వాత కురిసినా ప్రయోజనం దక్కుతుందన్నారు.
ఢిల్లీలో కృత్రిమ వర్షం కోసం ప్రభుత్వం రూ.3.21 కోట్లు కేటాయించింది. ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించాలనే ప్రతిపాదనను ఢిల్లీ మంత్రివర్గం మే 7న ఆమోదించింది. ఈ ప్రాజెక్టును పూణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM), భారత వాతావరణ శాఖ (IMD) నిపుణుల సమన్వయంతో నిర్వహిస్తున్నారు.
