Bomb Threat: దేశ రాజధాని ఢిల్లీలో గత కొద్దీ పాఠశాలలకు బాంబు బెదిరింపులు పంపిన కేసులో 12వ తరగతి విద్యార్థిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బెదిరింపులన్నీ బూటకమని తేలింది. ఇక, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకు దేశ రాజధానిలోని కనీసం 23 పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్‌లను పంపాడని చెప్పుకొచ్చారు. ప్రతిసారి అనుమానం రాకుండా ఉండేందుకు విద్యార్థి తన సొంత పాఠశాలలకు కాకుండా ఇతర స్కూల్స్ కు మెయిల్‌లను పంపినట్లు చెప్పుకొచ్చారు.
Read Also: Yuzvendra Chahal: ధనశ్రీ వర్మతో విడాకుల న్యూస్.. తొలిసారి స్పందించిన యుజ్వేంద్ర చహల్!
అయితే, పరీక్షలు రాయకుండా ఉండేందుకు సదరు విద్యార్థి బెదిరింపు మెయిల్స్ పంపినట్లు తమ విచారణలో తేలిందన్నారు పోలీసులు. మరిన్ని వివరాలను సేకరించేందుకు విద్యార్థినిని దక్షిణ ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. బెదిరింపు ఈమెయిల్‌లు పంపినట్లు అంగీకరించాడని సీనియర్ పోలీసు అధికారి అంకిత్ చౌహాన్ తెలిపారు. కాగా, ఢిల్లీలోని పాఠశాలలు, కళాశాలలకు గత కొన్ని నెలలుగా బాంబు బెదిరింపులు వచ్చాయి. భయాందోళనల వాతావరణం ఏర్పడిందన్నారు. అలాగే, మే 2024 నుంచి ఢిల్లీలోని ఆసుపత్రులు, విమానాశ్రయాలకు కూడా 50కి పైగా బాంబు బెదిరింపు ఈ-మెయిల్‌లు వచ్చాయి.