Site icon NTV Telugu

Delhi: 17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న తండ్రి, సోదరుడు..

Crimr News

Crimr News

Physical Assault on A Minor Girl: దేశంలో ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అఘాయిత్యాలకు, అత్యాచారాలకు అడ్దుకట్ట పడటం లేదు. రోజుకు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి, అన్నయ్యనే మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఈ ఘటనలో ఫిర్యాదు నమోదైంది.

Read Also: Love Today: సూపర్ హిట్ సినిమా రీమేక్ కి రంగం సిద్ధం…

గురుగ్రామ్ కు చెందిన 11వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై తండ్రి, సోదరుడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని పోలీసులు సోమవారం వెల్లడించారు. ఈ విషయాన్ని బాలిక తన స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్ కు చెప్పడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడుతూ.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని తండ్రి, సోదరుడు బెదిరించారని బాధితురాలు పోలీసులకు వెల్లడించింది.

దాదాపు నాలుగు గంటల పాటు బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత స్థానిక పోలీసులు పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వాస్తవాలను పరిశీలించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Exit mobile version