NTV Telugu Site icon

Delhi Water Crisis: ఢిల్లీలో నీటి కోసం ఘర్షణ.. ముగ్గురికి గాయాలు

Delhi Water

Delhi Water

ఢిల్లీలో నీటి సమస్య తీవ్ర తరమవుతుంది. నీటి కోసం దాడులు చేసుకున్న సంఘటనలు వెలువడుతున్నాయి. ద్వారకా జిల్లాలో నీటి కోసం పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని వారికి సర్దిచెప్పారు. అయితే.. ఈ ఘర్షణలో ఎలాంటి మతపరమైన కోణం లేదని పోలీసులు స్పష్టం చేశారు. పబ్లిక్‌ కుళాయి నుంచి నీటిని తీసుకునే విషయంలో ఘర్షణ జరిగినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా జె.శ్యామలరావు బాధ్యతల స్వీకరణ

ఈ ఘర్షణలో గాయపడ్డ ముగ్గురు వ్యక్తులను ఇందిరాగాంధీ ఆసుపత్రికి చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించి ఇరువర్గాల ఫిర్యాదు మేరకు రెండు కేసులు నమోదు చేశామన్నారు పోలీసులు. ఇరువర్గాల వాంగ్మూలాలపై విచారణ జరుపుతున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఎండ వేడిమి తీవ్రతతో ఢిల్లీలో నీటి సమస్య తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే.. నీటి సమస్యపై రాజకీయ రగడ సాగుతోంది. కుట్రలో భాగంగా.. పైపులైన్‌ను లీక్ చేసి, ప్రజలకు నీరు అందకుండా చేశారని ఢిల్లీ నీటి మంత్రి అతిషి ఆరోపించారు. ఢిల్లీలోని నీటి పైపులైన్ల భద్రతను పెంచాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను కోరారు. ఈ పైప్‌లైన్‌ను ఎవరు పగలగొడుతున్నారని మంత్రి సౌరభ్ భరద్వాజ్ ప్రశ్నించారు. దీనిపై విచారణ జరపాలన్నారు.

High Court : ట్రాన్స్‌జెండర్లకు 1% కోటా ఉండేలా చూడాలి.. హైకోర్ట్ ఆదేశం..

మరోవైపు.. ఢిల్లీలో నీటి సమస్యతో బాధపడుతున్న ప్రజలు ఛతర్‌పూర్‌లో ఉన్న ఢిల్లీ జల్ బోర్డు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా.. ఢిల్లీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వమని బీజేపీ నేత రమేషా బిధూరి విమర్శించారు. ఢిల్లీ జల్ బోర్డులో ఎలాంటి ఆడిట్ జరగలేదని.. ఢిల్లీ జల్ బోర్డు రూ.70,000 కోట్ల నష్టాల్లో ఉందని తెలిపారు. ఛతర్‌పూర్‌లోని డీజేబీ కార్యాలయంలో జరిగిన విధ్వంసంపై బిధురి మాట్లాడుతూ.. ఇది సహజం. ప్రజలు కోపంగా ఉన్నప్పుడు ఏదైనా చేయగలరని అన్నారు. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో ఏటా నీటి కొరత ఏర్పడుతోందని.. ఎవరు ఎవరిని మోసం చేయట్లేదని మంత్రి అతిషిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో ఏ పైపులు మార్చారో.. మంత్రి అతిషి వైట్ పేపర్ పై రాసివ్వాలని కోరారు. ఢిల్లీ ప్రజలకు సాకులు చెప్పేవాళ్లు అక్కర్లేదని కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.